S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 01:32

మచిలీపట్నం, డిసెంబర్ 5: బందరు ఓడరేవు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులకు నిరభ్యంతర పత్రాల జారీ చేసే అధికారాన్ని ఆర్డీవోకు బదలాయిస్తూ కలెక్టర్ బాబు.ఎ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై సోమవారం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) కార్యాలయంలో మడ వైస్ చైర్మన్ బి వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

12/06/2016 - 01:32

మచిలీపట్నం, డిసెంబర్ 5: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో వౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ బాబు.ఎ పిలుపునిచ్చారు. సర్వశిక్షాభియాన్ ప్రత్యేకంగా రూపొందించిన ‘బడి రుణం తీర్చుకుందాం’ పోస్టర్లు, బుక్‌లెట్‌ను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు.

12/06/2016 - 01:31

తోట్లవల్లూరు, డిసెంబర్ 5: మండలంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు కష్టాలు తీరటం లేదు. పెద్దనోట్ల రద్దు జరిగి 28 రోజులు కావస్తున్నా ప్రజలు నరకయాతన పడుతున్నారు. సోమవారం మండలంలోని బ్యాంకులు ఖాతాదారులతో కిక్కిరిసిపోయాయి. అయితే బ్యాంకు అధికారుల ఛీత్కారాలు ఖాతాదారులకు ఎదురవుతున్నాయి. కార్పొరేషన్ బ్యాంకులో రూపే కార్డుల కోసం ఉదయం నుంచి మహిలలు సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది.

12/06/2016 - 01:31

అవనిగడ్డ, డిసెంబర్ 5: మండల పరిధిలోని పులిగడ్డ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాంతి కల్యాణ మహోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవాన్ని మండలి భావన్నారాయణ దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అగ్నిహోత్రం నరసింహాచార్యులు, ధన్వంతరి ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి కళ్యాణం జరగ్గా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

12/06/2016 - 01:30

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 5: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

12/06/2016 - 01:29

విజయవాడ, డిసెంబర్ 5: నగదు కొరత తీర్చడానికి తాను ఎంత కృషి చేసినా వంద శాతం ఫలితాలు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులు, ఏటిఎంల దగ్గర నగదు లభ్యత, ఇ-పోస్ తరహా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే వున్నారని ఆయన సోమవారం రాత్రి తన కార్యాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో అన్నారు.

12/06/2016 - 01:29

విజయవాడ, డిసెంబర్ 5: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఏజెన్సీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పోలవరం ముంపు మండలాల్లో ఏజెన్సీ ప్రజలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

12/06/2016 - 01:28

విజయవాడ, డిసెంబర్ 5: జీవన భృతి కోసం భూమికి దూరంగా నడి సముద్రంలో రోజుల తరబడి గడిపే మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. కుటుంబాలను వదిలి ఒక్కోసారి వారాల తరబడి ఉండిపోయే మత్స్యకారులకు నిత్యం జీవన పోరాటమేనని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి వారి జీవన విధానాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

12/06/2016 - 01:28

విజయవాడ, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదని ప్రజల సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఏపిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. ఎపిసిసి కార్యాలయంలో ఎపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది.

12/06/2016 - 01:27

పాతబస్తీ, డిసెంబర్ 5: కృష్ణా విశ్వవిద్యాలయం (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఆంధ్రా లయోలా కైవసం చేసుకుంది. కాకరపర్తి భావనారాయణ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అం తర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ సోమవారం ఆ కళాశాల ప్రాంగణంలో జరిగింది. జిల్లాలోని ఐదు కళాశాలలకు చెందిన మహి ళా హ్యాండ్‌బాల్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి.

Pages