S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 23:14

నిర్మల్, డిసెంబర్ 5: ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి వాటి పరిష్కారానికి కృషిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇలంబరిది ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు.

12/05/2016 - 23:13

ఆదిలాబాద్, డిసెంబర్ 5: ప్రజావాణి, డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాల ద్వారా అందిన ఫిర్యాదులను జిల్లా అధికారులు జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు.

12/05/2016 - 23:11

నల్లగొండ, డిసెంబర్ 5: ట్రాక్టర్ ఇసుక ధర ఇక నల్లగొండ జిల్లాలో కేవలం 450రూపాయలే. ఇది నమ్మలేనట్లుగా ఉన్నా ఇదే నిజం. ఇసుక అక్రమ రవాణా నిరోధక చర్యలతో పాటు ప్రభుత్వ ఖజానాకు చిన్ననీటి ఇసుక వనరుల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని రాబట్టే లక్ష్యంతో నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం నుండి జిల్లాలో అమల్లోకి తెచ్చిన నూతన ఇసుక పాలసీతో ఇసుక ధరల రెక్కలు విరిగి సామాన్యుడికి ఇసుక చౌకగా మారింది.

12/05/2016 - 23:11

నల్లగొండ, డిసెంబర్ 5: భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి పంటల సాగు చేసిన పక్షంలో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని అధిక దిగుబడులు పొందవచ్చని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఉదయాధిత్య భవన్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా జాతీయ భూసార దినోత్సవం సదస్సును ఆయన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

12/05/2016 - 23:10

రాజాపేట, డిసెంబర్ 5: రైతు ఏడ్చిన రాజ్యంలో ఎక్కడైనా ప్రభుత్వాలు కొనసాగిన ధాఖలాలు లేవని డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని బొందుగుల ఎంపిటిసి ఎండి.అసునుద్దిన్ తండ్రి ఎండి.అబీబుద్దిన్ మరణం పట్ల వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల బతుకు బజారుపాలు అయ్యిందన్నారు.

12/05/2016 - 23:09

నల్లగొండ టౌన్, డిసెంబర్ 5: విధి నిర్వాహణలో బాధ్యతగా నడుచుకున్న వారికి ఎప్పటికైనా సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఐదుగురు ఎస్‌కె.లాల్ మహ్మద్, ఎండి.గౌస్, కె.లింగయ్య, కె.మత్స్యగిరి, ఎన్.యాదయ్యలకు ఏ ఎస్ ఐలుగా పదోన్నతి కల్పించారు.

12/05/2016 - 23:09

భువనగిరి, డిసెంబర్ 5: ఆసియాఖండంలోకెల్ల ఒకేరాయితో ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దంచేస్తున్నదని రాష్ట్ర టూరీజం శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. సోమవారం భువనగిరిలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి పురావస్తు, పర్యాటక, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/05/2016 - 23:08

సూర్యాపేట, డిసెంబర్ 5: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌లు నాటి నియంత హిట్లర్‌లా పరిపాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లాకేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

12/05/2016 - 23:07

సూర్యాపేట, డిసెంబర్ 5: క్రీడల ద్వారా స్వీయ క్రమశిక్షణ అలవడి తద్వారా జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచేందుకు దోహదపడుతాయని, అందువల్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

12/05/2016 - 22:15

సన్నజాజి తీగలా.. ఎర్రగులాబీ నవ్వులా.. తళుక్కున మురిపించే మెరుపు వనె్న -ప్రగ్యా జైస్వాల్. అయితే, ఆమెను అక్కడికే పరిమితం చేయొద్దంటున్నాడు కృష్ణవంశీ. ‘నక్షత్రాన్ని’ నేలకుదింపి ఓ రేంజ్‌లో ఉతికారేసే ఫైట్లు చేయిస్తున్నాడట ఆమెతో. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. బక్కపల్చని దేహంతో ప్రగ్య ఫైట్లు చేయడమేంటి? అని అనుకోవద్దని కూడా అంటోందట.

Pages