S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 23:20

విజయనగరం, డిసెంబర్ 5: నగదు లోటు భర్తీ చేసేందుకు నగదు రహిత లావాదేవీలు జరపడం ఉత్తమమైన మార్గమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని చెప్పారు. చిన్న నోట్లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు మండల, గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

12/05/2016 - 23:20

విజయనగరం, డిసెంబర్ 5: జిల్లాలో గృహనిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహనిర్మాణ శాఖపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు నియోజకవర్గాల నుంచి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రాలేదన్నారు.

12/05/2016 - 23:19

విజయనగరం, డిసెంబర్ 5: జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.జితేంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి తహశీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాసాధికార సర్వే ఏ మేరకు చేశారో అడిగి తెలుసుకున్నారు.

12/05/2016 - 23:19

జామి, డిసెంబర్ 5: చెరకు రైతుల నుండి ప్రభుత్వం ఎటువంటి లాభం ఆశించడంలేదని రాష్ట్ర చక్కెర కర్మాగారం కమిషనర్ ఎల్. మురళి అన్నారు. సోమవారం ఆయన భీమసింగి చక్కెర కర్మాగారం పరిశీలనకు వచ్చి కలసిన విలేఖరులతో మాట్లాడుతూ చక్కెర కర్మాగారాల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పన్ను చెల్లింపుతోపాటు వ్యాట్‌ట్యాక్స్‌ను రద్దుచేసిందన్నారు.

12/05/2016 - 23:18

గజపతినగరం, డిసెంబర్ 5: కలుషితమైన నేలను కాపాడుకోవడానికి అన్నదాతలు ముందుకు రావాలని గజపతినగరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్.అన్నపూర్ణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

12/05/2016 - 23:16

ఆసిఫాబాద్, డిసెంబర్ 5: సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా పోలీసులను ఆయన ఆదేశించారు.

12/05/2016 - 23:16

ఆసిఫాబాద్, డిసెంబర్ 5: ప్రజాసమస్యలపై ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించ రాదని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న కలెక్టర్ చంపాలాల్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించారు. వారి సమస్యలను ఓపికతో విన్నారు.

12/05/2016 - 23:15

మంచిర్యాల, డిసెంబర్ 5: క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యలయమంలో పండుగ నిర్వహన కమీటి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు.

12/05/2016 - 23:15

మంచిర్యాల, డిసెంబర్ 5: ప్రజా ఫీర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను అదేశించారు. ప్రజాఫీర్యాదుల కార్యక్రమం సందర్బంగా సోమవారం కలెక్టర్ కార్యలయంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. లక్షెటిపేట మండలం జెండా వెంకటపూర్ గ్రామానికి చెందిన అవునూరి భాస్కర్ బిటెక్ పూర్తి చెశాడు.

12/05/2016 - 23:15

నిర్మల్, డిసెంబర్ 5: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలనే ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాయిబాబా విమర్శించారు. సోమవారం నిర్మల్‌లోని టిఎన్జీవో సంఘ భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages