S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 04:50

మంత్రాలయం,డిసెంబర్ 4:పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం గజలక్ష్మికి మఠం అధికారులు బరువెక్కిన హృదయాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కుకు తరలించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు గజరాజుకు ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.

12/05/2016 - 04:47

తిరుపతి, డిసెంబర్ 4: నగదురహిత లావాదేవీలను అన్ని వర్గాల ప్రజలకు అలవాటు చేయడానికి అధికారులు, బ్యాంకర్లు కృషి చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సూచించారు. ఆదివారం ఉదయం మంత్రి, జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్ జైన్, నగదురహిత లావాదేవీల నోడల్ అధికారి కరికాలవళవన్‌తో కలసి అధికారులు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు.

12/05/2016 - 04:44

వరంగల్, డిసెంబర్ 4: పరిపాలనా సౌలభ్యం పేరిట వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించి సుమారు రెండు నెలలు కావస్తున్నా అధికార పార్టీ టిఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయటంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి.

12/05/2016 - 04:41

కరీంనగర్, డిసెంబర్ 4: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగుతుందని, తద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

12/05/2016 - 04:39

కుబీర్, డిసెంబర్ 4: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పథకంతో వచ్చే జూన్‌నాటికి ప్రతి గ్రామానికి శుద్దజలాన్ని అందించడం జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే విఠ్ఠల్‌రెడ్డి అన్నారు. వాటర్‌గ్రిడ్ పనుల్లో భాగంగా మండల కేంద్రంలో రూ.కోటి 15లక్షల నిధులతో నిర్మించే పంపు, ట్యాంకు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

12/05/2016 - 04:38

మెదక్, డిసెంబర్ 4: పోలీస్ 30 యాక్ట్ ఈ నెల 30 వరకు అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం మాట్లాడుతూ వెల్లడించారు. 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు సభలు సమావేశాలు అనుమతులు లేకుండా నిర్వహించకూడదని ఆమె తెలిపారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, డిజేల ఏర్పాటు కోసం డిఎస్పీ అనుమతి పొందాల్సి ఉంటుందని చందనాదీప్తి తెలిపారు.

12/05/2016 - 04:36

మక్తల్, డిసెంబర్ 4: పత్తి విత్తనాలను ఉత్పత్తిచేస్తున్న రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఎఐకెఎంఎస్ జిల్లా నాయకుడు భగవంతు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మక్తల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో 30 వేల మంది రైతులు దశాబ్ధాలుగా పత్తివిత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు.

12/05/2016 - 04:34

నిజామాబాద్, డిసెంబర్ 4: నిర్ణీత సమయానికి అనుగుణంగా పూర్తికాని సిలబస్, సర్కారీ బడులలో అరకొర వసతుల నడుమ నెలకొని ఉన్న సవాలక్ష సమస్యలు, ఉపాధ్యాయుల కొరత వంటి కారణాల వల్ల ఈ సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు ఏమేరకు మెరుగుపడతాయన్నది సందేహాస్పదంగా మారింది.

12/05/2016 - 04:32

దేవరకొండ, డిసెంబర్ 4: తీవ్రమైన వర్షాభావ పరిస్ధితుల వల్లకరవుతో విలవిలలాడుతున్న దేవరకొండ నియోజకవర్గాన్ని ఆదుకునేందుకు డిండి ప్రాజెక్ట్‌ను కృష్ణా జలాలతో నింపి సాగు, తాగునీరు అందించాలని, దొండ తోటలను అధికంగా సాగు చేస్తున్న పెద్దఅడిశర్లపల్లి మండలంలో దొండ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మెన్ బాలూనాయక్ ఆదివారం హైద్రాబాద్‌లో భారీనీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, విద

12/05/2016 - 04:30

ఖైరతాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర వాసులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తున్నారు. దేశ రాజధానిలో డిజిటల్ లావాదేవీలు ము మ్మరంగా జరుగుతున్నట్టు, అక్కడి వ్యాపారులు ఇబ్బందులు లేకుం డా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకుంటున్న నగర వ్యాపారులు, ప్రజలు ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధవౌతోన్నారు.

Pages