S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 04:59

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లు దాటుతున్నా కొలిక్కిరావడం లేదు. రాష్ట్రంలో జరగాల్సిన కొన్ని పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు ముందు మాత్రమే ఈ క్యాంటీన్లు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే పథకం ఇంకా ప్రారంభించకపోవడం వెనుక ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తవౌతోంది.

12/05/2016 - 04:59

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో 75 లక్షలకు పైగా జనాభా కలిగిన ఏకైక అతిపెద్ద కులమైన మాలల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం చేసి అంబేద్కర్ ఆశయమైన రాజ్యాధికారం కోసం మాల మహానాడును రాజకీయ పార్టీగా తీర్చిదిద్దబోతున్నట్లు మాల మహానాడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు యర్రమళ్ల రాములు, పంతగాని రమేష్ వెల్లడించారు.

12/05/2016 - 04:58

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 4: కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మూడు స్టేడియాల్లో జరుగుతున్న డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జా తీయస్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్,డబుల్స్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది.

12/05/2016 - 04:57

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 4: మాంటిస్సోరి మహిళా కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల కబడ్డీ మహిళల టోర్నమెంట్ ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించారు. టోర్నమెంట్‌ను ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి రవి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో ఐదు జట్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించారు.

12/05/2016 - 04:57

పెడన, డిసెంబర్ 4: పట్టణంలోని సర్వోదయ చేనేత సొసైటీ వద్ద రూ.38.60లక్షలతో నిర్మించనున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ పనులకు ఆయన ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. బ్రహ్మపురం రోడ్డులో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నాఠు.

12/05/2016 - 04:56

మచిలీపట్నం, డిసెంబర్ 4: గత యేడాది ఖరీఫ్ సీజన్‌లో కరవు కోరల్లో చిక్కుకుని పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.5కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఎకౌంట్‌లో జమ చేసింది. త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేయనున్నారు.

12/05/2016 - 04:55

తోట్లవల్లూరు, డిసెంబర్ 4: మండలంలో కూలీలతో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా మరోపక్క యంత్రాలతో అదేరీతిలో కోతలు కోస్తుండటంతో కళ్ళాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. యంత్రాలతో కోతకోయటంతో వెంటనే ధాన్యం రాశులు సిద్ధమవుతున్నాయి. నాలుగు రోజులు ఆరబెట్టి అమ్మేద్దామను కుంటున్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

12/05/2016 - 04:55

మచిలీపట్నం, డిసెంబర్ 4: జిల్లా కేంద్రం మచిలీపట్నంను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియాన్ని నిర్మించి మచిలీపట్నంకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురానున్నట్లు తెలిపారు. స్టేడియం నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

12/05/2016 - 04:54

గూడూరు, డిసెంబర్ 4: చేనేత రంగాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కప్పలదొడ్డి గ్రామంలో రూ.38.63లక్షలతో నిర్మించిన శ్రీదేవల మహర్షి వీవర్స్ కో-ఆపరేటీవ్ సొసైటీ కామన్ ఫెసిలిటీ భవనాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌తో కలిసి ఆదివారం మంత్రి రవీంద్ర ప్రారంభించారు.

12/05/2016 - 04:52

సూళ్లూరుపేట, డిసెంబర్ 4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7వ తేదీన పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు.

Pages