S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 23:58

విశాఖపట్నం, డిసెంబర్ 4: మూడు రోజుల ముచ్చటగానే పట్టాలెక్కిన డబుల్ డెక్కర్ మళ్ళీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యక్షం కానుంది. దీనిని మళ్ళీ పట్టాలెక్కించాలని దక్షిణమధ్య రైల్వేజోన్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ సారి పట్టాలెక్కనున్న ఇది పూర్తిస్తాయిలో నడువనుందని తెలిసింది. విజయవాడ-విశాఖపట్నం మధ్య గత కొనే్నళ్ళుగా నడుస్తున్న రత్నాచల్‌కు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.

12/04/2016 - 23:57

విశాఖపట్నం, డిసెంబర్ 4: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్‌కె బీచ్‌లో తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విన్యాసాలు ఆద్యంతం కనువిందు చేశాయి. నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటే విధంగా సైనికులు, సెయిలర్లు చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిధిగా హాజరై నౌకాదళ విన్యాసాలను తిలకించారు.

12/04/2016 - 23:55

శ్రీకాకుళం, డిసెంబర్ 4: ప్రభుత్వ పథకాలనుసకాలంలో ప్రజలకు అందజేసి నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించాలని జెడ్పి చైర్‌పర్సన్ చైదరి ధనలక్ష్మీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జెడ్పి సమావేశ మందిరంలో 2,4,1,7,3,5,6వ స్థాయి సంఘసమావేశాలు జరిగాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశాల్లో ముందుగా 2,1,7వ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి.

12/04/2016 - 23:54

శ్రీకాకుళం, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్న చిన్నారావు మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ 32 అంతర్ జిల్లా క్రాస్ కంట్రీ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

12/04/2016 - 23:54

ఇచ్ఛాపురం, డిసెంబర్ 4 : ఉద్దానంలోని కిడ్నీ రోగులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం స్థానిక మణికంఠ థియేటర్‌లో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన ప్రతినిధులు కీర్తేష్, హర్ష, పట్టణ ఇన్‌చార్జి ఎస్‌ఐ చిన్నమనాయుడు ఆదివారం థియేటర్‌ను పరిశీలించారు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నదీ ఎస్‌ఐ తెలుసుకున్నారు. కొన్ని సూచనలు చేశారు.

12/04/2016 - 23:53

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 4: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దుచేయడం ఆర్థిక సంస్కరణలు తెచ్చేందుకేనని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాధబాబు అన్నారు. స్థానిక హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్ మనీ రోజురోజుకీ పెరిగిపోతుందని ఇన్‌కమ్‌ట్యాక్ దాడులు ఇంకా ముమ్మరం చేయనున్నట్లు స్పష్టంచేశారు.

12/04/2016 - 23:53

బలగ, డిసెంబర్ 4: జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మూడవ అంతర్‌జిల్లా క్రాస్‌కంట్రీ పోటీల ఛాంపియన్‌షిప్‌గా శ్రీకాకుళం కైవశం చేసుకుంది. రెండు ఏజ్ గ్రూప్‌ల మినహా అన్ని అంశాల్లో శ్రీకాకుళం వాసులు సత్తాచాటడంతో పాయింట్ల ప్రాతిపదికన ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు.

12/04/2016 - 23:52

నరసన్నపేట, డిసెంబర్ 4: మండల కేంద్రంలో స్థానిక గాంధీ కళామండపంలో ఘంటసాల 94వ జయంత్యుత్సవాలు కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గీత్ సంగీత్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఘంటసాల మల్లేశ్వరరావు, పాడుతా తీయగా ఫేం. స్వాతిజగన్ లు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

12/04/2016 - 23:51

రాజమహేంద్రవరం, డిసెంబర్ 4: రివర్ సిటీ రాజమహేంద్రవరం ఇక గ్రేటర్ నగరంగా అవతరించింది..ఇక జీవో జారీ కావడమే తరువాయిగా వుంది. మొత్తం పదమూడు గ్రామాలను విలీనం చేసుకుంటూ విస్తరిస్తోంది. భౌగోళిక స్వరూపం మారనుంది. వౌలిక సదుపాయలు విస్తరిస్తున్నాయి. నాలుగు దశాబ్ధాలుగా వున్న పాత నగరం ఇపుడు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు.

12/04/2016 - 23:49

కాకినాడ, డిసెంబర్ 4: పెద్ద నోట్లు రద్దయిన నాటి నుండి ప్రతిరోజూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చి సామాన్యుల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. పరిమితికి మించివున్న బంగారానికి లెక్కలు చెప్పని పక్షంలో చిక్కుల తప్పవని ప్రకటించి కలకలం సృష్టించారు. ఈ పరిణామానికి మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త రెండు వేల నోటు తాత్కాలికమేనంటూ ప్రచారం జరుగుతోంది.

Pages