S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 00:19

ముంబయి, డిసెంబర్ 4: నల్లధనం నిరోధానికి పన్ను చట్టాల మార్పు అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం పన్ను చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. నల్లధనం కట్టడికి అవలంభించాల్సిన చర్యల్లో ఒకటి మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకోవాల్సి ఉందని అన్నారు.

12/05/2016 - 00:18

పనాజి, డిసెంబర్ 4: బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలను తీసుకుని వాటి ఎగవేతకు పాల్పడిన విజయ్ మాల్యా, అలాంటి వాళ్లందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) డిమాండ్ చేసింది. ‘తీసుకున్న రుణాలను చెల్లించని మాల్యాతోసహా 8వేల మంది డిఫాల్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.’ అని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సివి వెంకటాచలం ఆదివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు.

12/05/2016 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలలో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్ కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది.

12/05/2016 - 00:12

అనంతపురం, డిసెంబర్ 4 : జిల్లాలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తరచూ చోరీలు జరుగుతుండటంతో రైలు ప్రయాణమంటే జనం భయాందోళన చెందుతున్నారు. దుండగులు కాపు కాచి మరీ నిలబడిన రైళ్లలో యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి వ్యూహాలు రైల్వే భద్రతా సిబ్బంది, అధికారుల అంచనాలకు సైతం చిక్కడం లేదు.

12/05/2016 - 00:10

కదిరి, డిసెంబర్ 4: అక్రమ లే ఔట్లకు కేరాఫ్‌గా కదిరి మున్సిపాలిటీ నిలిచిందని చెప్పుకోవచ్చు. మామూళ్లు ఇస్తే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా యధేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా షేక్ సురియా భాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అక్రమ నిర్మాణాలు, లే ఔట్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

12/05/2016 - 00:09

మడకశిర, డిసెంబర్ 4 : పసుపు, కుంకుమ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మహిళలు జాగ్రత్తగా ఉండాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం మడకశిర నీలకంఠ కోల్డ్‌స్టోరేజీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాల అనంతరం డ్వాక్రా మహిళలను మభ్య పెట్టేందుకు పసుపు, కుంకుమ పథకం ప్రవేశపెట్టారని విమర్శించారు.

12/05/2016 - 00:09

హిందూపురం, డిసెంబర్ 4 : ‘ఎమ్మెల్యే బాలకృష్ణా... నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకో’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచి ంచారు. ఆదివారం స్థానిక పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని రఘువీరాతోపాటు డిసిసి అధ్యక్షులు కోటాసత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ త దితర కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.

12/05/2016 - 00:08

హిందూపురం, డిసెంబర్ 4 : పెద్ద నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఆదివారం బ్యాంకులు పనిచేయకపోవడం, ఎటిఎంలు ఎక్కడా తెరుచుకోకపోవడంతో రోజువారి నిత్యావసరాలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులో ఉంచినా చిల్లర లేని కారణంగా వ్యాపారులు ఆ నోటు తీసుకొనేందుకు ససేమిరా అంటున్నారు.

12/05/2016 - 00:07

చిలమత్తూరు, డిసెంబర్ 4 : మండల పరిధిలోని కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో శనివారం రాత్రి దారి దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనం వెళ్తున్న ముగ్గురిని అడ్డగించి రూ.11వేల నగదు, 4 తులాల బంగారం, మూడు సెల్‌ఫోన్‌లను దోచుకెళ్లారు.

12/05/2016 - 00:07

వజ్రకరూరు, డిసెంబర్ 4 : మండల పరిధిలోని మిరప తోటల్లో ఆదివారం రాత్రి చిరుతల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు రోజూమాదిరిగానే తోటలకు నీరు పెట్టేందుకు వెళ్లారు. అయితే మూడు చిరుతలు తోటల్లో సంచరిస్తుండటం గమణించారు. దీంతో మిరపచెట్లలో, సమీప పొదల్లో దాక్కున్నట్లు రైతులు వాపోయారు.

Pages