S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 00:05

కడప,డిసెంబర్ 4: కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో రూ.500, రూ.1000లు మార్పిడి వ్యవహారంలో జిల్లాలోని వివిధ పోస్ట్ఫాసుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకోవడంతో సోమవారం పోస్ట్ఫాసుల తనిఖీ నిమిత్తం కేంద్ర బృందాలు వస్తున్నాయి. పోస్టమాస్టర్ జనరల్ ఈమేరకు ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపి సమగ్రవిచారణకు ఆదేశాలు ఇచ్చారు.

12/05/2016 - 00:05

కడప, డిసెంబర్ 4 : భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను వదిలి దేశ రక్షణలో నిమగ్నమై బద్వేలుకు చెందిన చిన్నవెంకటసుబ్బయ్య తుదిశ్వాస విడిచన సంఘటన ఆదివారం ఆర్మీ అధికారుల నుంచి తెలియవచ్చింది.

12/05/2016 - 00:04

కడప,డిసెంబర్ 4:తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నెలరోజులపాటు నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన జన చైతన్యయాత్రలు సందర్భంగా ఇప్పటివరకు నమోదుచేసిన సభ్యత్వాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలోకి చేరింది. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) నేతలందరితో 30రోజుల్లో సభ్యత్వాలను నమోదుచేయడంలో తనదైన శైలిలో అందర్నీ కలుపుకుని వ్యవహరించడంతో దాదాపు మూడులక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి.

12/05/2016 - 00:03

ప్రొద్దుటూరు, డిసెంబర్ 4: నేడు రబీ పంటసాగులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగైన మినుము, శనగపంటను చూస్తే సక్రమంగా దిగుబడులురాని పరిస్థితి నెలకొనివుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఇప్పటికే మినుముపంట పంటనూర్పిళ్లు జరిగాయి. ఎకరాకు కనీసం ఏడెనిమిది క్వింటాళ్లు రావాల్సి వుండగా క్వింటా, రెండు క్వింటాళ్లకే పరిమితమైంది.

12/05/2016 - 00:03

కడప,డిసెంబర్ 4: జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో తుంపర జల్లులు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం రాత్రి కూడా వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల కొంతమంది రైతులకు ఉపశమనం కలిగినా మరికొంతమంది రైతులకు నష్టమే చేకూర్చింది. ఖరీఫ్‌లో సాగుచేసిన వరి, ఆరుతడిపంటలు, కూరగాయలసాగుకు ఇబ్బందికరంగా మారింది.

12/05/2016 - 00:02

సిద్దవటం,డిసెంబర్ 4: స్నేహితునికి కుమార్తె పుట్టడంతో సిద్దవటం పెన్నానది వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన విందులో ఓ యువకుడు గల్లంతైన విషాధసంఘటన చోటుచేసుకుంది. యువకుడి స్నేహితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ఇందిరానగర్ గ్రూప్ హౌస్‌కు చెందిన చాన్‌బాషాకు ఇటీవల కుమార్తె జన్మించడంతో పెన్నానది వద్ద విందు ఏర్పాటుచేసి స్నేహితులను ఆహ్వానించాడు.

12/05/2016 - 00:00

విశాఖపట్నం, డిసెంబర్ 4: మహా విశాఖ నగరానికి మరింత వనె్న తెచ్చే విధంగా వస్తుందనుకున్న మెట్రో రైల్ ప్రాజెక్టు ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలో పూర్తి చేయాలని, దీనికి విదేశీ బ్యాంకులు సాయం అందిస్తాయని తొలి నుంచి భావిస్తున్నారు.

12/05/2016 - 00:00

కశింకోట, డిసెంబర్ 4: ఆర్‌ఇసిఎస్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొటాన అప్పారావు సమర్ధుడైన నాయకుడని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆర్‌ఇసిఎస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కొటాన ప్రమణాస్వీకారోత్సవంలో స్థానిక ఎమ్మె ల్యే పీలా గోవిందసత్యనారాయణ అధ్యక్షత వహించారు.

12/04/2016 - 23:59

విశాఖపట్నం, డిసెంబర్ 4: నోట్ల కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరకు నెలంతా కష్టించి శ్రమకు తగిన ఫలితం కోసం చివరిలో నిరీక్షించే ఉద్యోగులు తమ జీతాలు తినేందుకు యోగం లేకుండా పోతుంది. కష్టపడినా చాలీ, చాలని జీతాలతో ఇంటిళ్ళపాదిని పోషించాల్సిన పరిస్థితుల్లో పెద్ద నోట్ల రద్దు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. సామాన్యులకు దాదాపు నెల రోజుల నుంచి తెల్లరితే ఎలా బతకాలా? అనే కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

12/04/2016 - 23:59

కశింకోట, డిసెంబర్ 4: దేశంలో ఎక్క డా లేని విధంగా రైతులకు సుమారు 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక్క చంద్రబాబునాయుడేనని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కశింకోటలో జరిగిన జనచైతన్యయాత్ర లో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా మూడువేలు చొప్పున అందజేసారన్నారు. భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు ఉందన్నారు.

Pages