S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత టెన్నిస్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌ను మార్చవద్దంటూ నలుగురు సీనియర్ ఆటగాళ్లు భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)కు లేఖ రాశారు. జట్టులో క్రమశిక్షణ కరవైందని, ఆధిపత్య పోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆనంద్, కోచ్ జీషన్ అలీపై ఎఐటిఎ ఆగ్రహంతో ఉంది. ఈనెలాఖరుతో వారి కాంట్రాక్టు ముగియనుండగా, దానిని పునరుద్ధరించే ఆలోచనలో లేదని వార్తలు వచ్చాయి.

12/05/2016 - 01:25

చాపెకో (బ్రెజిల్): కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో మృతి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు తుది వీడ్కోలు పలికారు. బ్రెజిల్ యావత్తు ఈ దుర్ఘటనపై కార్చిన కన్నీరు భారీ వర్షం రూపంలో కురుస్తున్నా లెక్క చేయని వందలాది మంది అభిమానులు సాకర్ ఆటగాళ్ల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలను ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ విమాన సంఘటనలో మొత్తం 71 మంది మరణించిన విషయం తెలిసిందే.

12/05/2016 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దు తరువాత జన్‌ధన్ ఖాతాల్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లు ఇప్పుడు తగ్గినట్లు కనిపిస్తోంది. నవంబర్ 30తో ముగిసిన వారంలో కేవలం రూ.1,487 కోట్లు మాత్రమే ఈ ఖాతాల్లో జమ అయ్యాయి. అంతకుముందు వారం రూ. 8,283 కోట్లు ఈ ఖాతాల్లో జమ అయ్యాయి. 25.85 కోట్లు గల ఈ ఖాతాల్లో నవంబర్ 30నాటికి మొత్తం రూ.

12/05/2016 - 01:15

నగదు కష్టాలు ఏ మేరకు పెరిగాయో తెలియజెప్పేందుకు ఈ చిత్రమే చక్కని ఉదాహరణ. ఆదివారం సెలవు రోజు అయనప్పటికీ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు గుర్‌గావ్‌లోని ఓ ఏటిఎం వద్ద పడిగాపులు కాస్తున్న జనం

12/05/2016 - 01:14

అమృత్‌సర్, డిసెంబర్ 4: ప్రధాని నరేంద్ర మోదీ, అప్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఆదివారం ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, యుద్ధంతో ఛిన్నాభిన్నమైన అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపడుతున్న పునర్నిర్మాణ కార్యకలాపాలు, రక్షణ, భద్రత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలులాంటి కీలక అంశాలపై ప్రధానంగా ఈ చర్చలు జరిగాయి.

12/05/2016 - 01:11

నాగపూర్, డిసెంబర్ 4: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గడ్కరీ చిన్న కుమార్తె అయిన కెట్కి వివాహం అమెరికాలో ఫేస్‌బుక్ కంపెనీలో పనిచేస్తున్న ఆదిత్య కాష్కేడికర్‌తో జరిగింది.

12/05/2016 - 01:09

అమృత్‌సర్, డిసెంబర్ 4: అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సు అమృత్‌సర్ నగరంలో జరుగుతున్న సందర్భంగా ఆదివారం ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌తో ఈ పురాతన నగరానికి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేశారు.

12/05/2016 - 01:07

హవానా, డిసెంబర్ 4: విప్లవ యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన అంతిమ యాత్ర ఆదివారం క్యూబాకు ఆగ్నేయంగా ఉన్న శాంటియాగో డి నగరంలోని శాంటా ఫిజెనియా స్మశాన వాటికలో క్యాస్ట్రో అంత్యక్రియలు జరిగాయి. గంట పాటు జరిగిన కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగిందని క్యూబా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

12/05/2016 - 01:04

అరుదైన సముద్ర జాతికి చెందిన భారీ తిమింగలం మృత కళేబరం పూరి జిల్లాలోని బైధారా పెంతా బీచ్‌కు కొట్టుకొచ్చింది. దీని పొడవు 42 అడుగులు కాగా వెడల్పు 28 అడుగులు. ఇది పది పదిహేను రోజుల క్రితమే మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

12/05/2016 - 01:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: షెడ్యూల్డు కులాల సబ్-ప్లాన్ (ఎస్‌సిఎస్‌పి), గిరిజన సబ్-ప్లాన్ (టిఎస్‌పి)ల కింద ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కేటాయించిన నిధులు మురిగిపోకుండా, సకాలంలో వాటిని సద్వినియోగం చేయడానికి అవసరమైన మార్గాలను అనే్వషించాలని నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Pages