S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/13/2018 - 02:22

విజయవాడ, ఏప్రిల్ 12: యానిమేషన్, గేమింగ్ కంపెనీలను ఆకర్షించే విధంగా త్వరలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీని రూపొందించనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఐటి శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేక పాలసీలను తీసుకువచ్చామన్నారు. ఆశించిన మేర ఫలితాలు వస్తున్నాయన్నారు.

04/13/2018 - 02:22

విజయవాడ, ఏప్రిల్ 12: ప్రత్యేక హోదా, విభజనాంశాల అమలుకై తక్షణం గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌లలో తీర్మానాలు చేసి, ప్రధాని నరేంద్రమోదీకి పంపించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ నిర్ణయించింది. నగరంలో జరిగిన ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో చేసిన నిర్ణయాలను ఛాంబర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ గురువారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు.

04/13/2018 - 02:21

విజయవాడ, ఏప్రిల్ 12: ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ఇకపై పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మాత్రమే పంపిణీ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గృహ నిర్మాణ పథకాల కింద లబ్దిదారులుగా వారిని ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు.

04/13/2018 - 02:21

విజయవాడ, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉద్ధృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హోదా సాధన కోసం ఈనెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని వామపక్షాలు మద్దతు తెలిపాయి.

04/13/2018 - 02:20

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో అర్హులైన పాత్రికేయులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో జర్నలిస్ట్‌ల యూనియన్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/11/2018 - 04:03

గుంటూరు: అందమైన నగరాల నిర్మాణం ఒక్కటే సరిపోదు.. మానవ వికాసానికి భవంతులే కొలమానం కాదు.. తోటి జీవరాశులను పరిరక్షించుకోకపోతే ప్రకృతి వినాశం తప్పదు.. అదే సమయంలో పంచ భూతాలను పరిరక్షించుకోవాలి.. గ్రామీణ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కనీస సదుపాయాలను కల్పించటంతో పాటు సమష్టి తత్వంతో స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని ‘ఇషా’ ఫౌండేషన్ వ్యవస్థాపకు లు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు.

04/11/2018 - 03:58

విజయవాడ, ఏప్రిల్ 10: బంగార ఆభరణాల్లో నాణ్యతను గుర్తించేందుకు వీలుగా రాష్ట్రంలో 5 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర స్థాయి విజిలెన్సు కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు ఆయా జిల్లాల ప్రజలు తినే బియ్యానే్న పంపిణీ చేసేందుకు వీలుగా పంటల్లో మార్పుపై దృష్టి సారించామన్నారు.

04/11/2018 - 03:56

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరుకు చెందిన పోచరెడ్డి రాకేష్‌రెడ్డి 2,652 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అఖిల భారత యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో పీఆర్వో టికె రామ్ ఆధ్వర్యంలో ఏపీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

04/11/2018 - 03:54

విజయవాడ, ఏప్రిల్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం పనులు కనీసం ఒక్కో గ్రామంలో 20 లక్షల రూపాయల మేర జరగాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ల వర్క్‌షాపులో మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఈ పథకాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

04/11/2018 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 10: ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీలో జాప్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. మన్యంలోని గర్భిణులు, బాలింతలు, బాలికల ఆరోగ్య రక్షణకు గిరిజన మండలాలను దత్తత తీసుకోవాలని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలను చైతన్యపర్చాలని, వారితోపాటు జిల్లాస్థాయి అధికారులు కూడా ముందుకు రావాలన్నారు.

Pages