S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/24/2018 - 02:50

విజయవాడ, జనవరి 23: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం మంగళవారం వాడివేడిగా జరిగింది. పట్టిసీమ ప్రాజెక్టుపై వైకాపా నిలదీయగా, వివరాలు వెల్లడించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఖర్చులపై కమిటీ సభ్యులు అధికార పక్షాన్ని, అధికారులను నిలదీశారు. దీంతో సమావేశంలో అరుపులు, కేకలు చోటు చేసుకున్నాయి.

01/24/2018 - 02:49

విజయవాడ, జనవరి 23: రాజధాని పరిపాలనా భవనాల పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 11న కేత్రస్థాయిలో నేలపాడు, రాయపూడి ప్రాంతాల్లో పర్యటన చేసిన నాటి నుండి ఈరోజు పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూడవచ్చని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు.

01/24/2018 - 02:45

విజయవాడ, జనవరి 23: ఫార్మా డీ విద్యార్థులను ప్రభుత్వపరంగా ఆదుకుని తగిన న్యాయం అందించేలా కృషి చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నివాసంలో ఫార్మా డీ విద్యార్థుల సంఘంతో సమావేశమయ్యారు.

01/24/2018 - 02:42

అమరావతి/మారేడుమిల్లి, జనవరి 23: జాజివలస.. కొండలు, కోనల నడుమ మారుమూల జనజీవన స్రవంతికి దూరంగా, కనీసం ఫోను సదుపాయానికి కూడా నోచుకోకుండా ఉన్న గ్రామమది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వై.రామవరం మండలం, కనివాడ పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం ఇప్పటివరకు ఎవరైనా వెళితే కనీసం మాట్లాడటానికి ఎలాంటి ఫోను సదుపాయం, నెట్ కనెక్షన్ ఉండేది కాదు.

01/24/2018 - 02:39

విజయవాడ, జనవరి 23: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, మరింత పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

01/24/2018 - 02:36

కాకినాడ, జనవరి 23: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిఇటి) సమయాన్ని పొడిగించాలని డిమాండుచేస్తూ వేల సంఖ్యలో ఉపాధ్యాయ అభ్యర్థులు మంగళవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వాహనాన్ని ముట్టడించారు. వాహనాన్ని చుట్టుముట్టిన సుమారు 2వేల మంది అభ్యర్ధులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదల్లేని పరిస్థితిలో స్తంభించింది.

01/24/2018 - 02:34

కర్నూలు, జనవరి 23: తమకంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుడి కట్టి కృతజ్ఞత చాటుకునేందుకు హిజ్రాలు సిద్దమయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నుంచి మహానందికి వెళ్లే మార్గంలో గుడి కట్టేందుకు అవసరమైన స్థలం, చంద్రబాబు వెండి విగ్రహాన్ని సిద్ధం చేశారు. త్వరలో గుడి నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు.

01/24/2018 - 02:34

కడప,జనవరి 23: కుటుంబ కలహాలు తండ్రీకొడుకుల ప్రాణాల మీదకు తెచ్చింది. భార్య కాపురానికి రావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ గంగరాజు, తండ్రి కోసం కొడుకు రాకేష్ వాస్మోయిల్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండగా, కుమారుడు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. కడప కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.

01/23/2018 - 04:28

అమరావతి, జనవరి 22: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందస్తు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన కులాల ఓట్లపై కనే్నశారు. 2004నాటి మాదిరిగా తన ప్రభుత్వాన్ని దింపేయాలన్నంత కసి, పట్టుదల ఏ వర్గంలోనూ ఇప్పుడు లేకపోవడం, గత ఎన్నికల్లో కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడాతోనే ప్రభుత్వంలోకి వచ్చిన వైనాన్ని విశే్లషించుకున్న బాబు..

01/23/2018 - 04:27

విజయవాడ, జనవరి 22: ప్రజల నుండి వచ్చిన విజ్ఞాపనలు, అర్జీలలో ఆర్థికేతరమైన అంశాలకు సంబంధించిన అర్జీలన్నిటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కారంపై ఆయన సమీక్షించారు.

Pages