S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/24/2018 - 03:29

పెళ్లకూరు, జనవరి 23: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం జిల్లా పరిథిలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి ప్రవేశించింది.

01/24/2018 - 02:56

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 23: ఏపీ మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పలు సంస్థలతో భేటీ అవుతూ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తూ బీజీగా ఉన్నారు.

01/24/2018 - 02:55

విజయవాడ, జనవరి 23: విజయవాడ దుర్గ గుడి ఈవోగా డాక్టర్ ఎం.పద్మను ప్రభుత్వం నియమించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరిస్తున్న ఆమెను పూర్తి స్థాయి ఈవోగా మంగళవారం నియమించింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు వేసి సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేసి, ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధను ఇటీవల నియమించింది.

01/24/2018 - 02:55

నందిగామ, జనవరి 23: గవర్నర్ నర్శింహన్ తీరుపై సోమవారం తీవ్ర స్థాయిలో చేసిన విమర్శను వెనక్కు తీసుకుంటున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.

01/24/2018 - 02:54

విజయవాడ, జనవరి 23: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని విడుదల చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ఖైదీల బంధువుల నుంచి జీవిత ఖైదీల విడుదలపై ప్రభుత్వానికి వినతులు అందాయి.

01/24/2018 - 02:54

అమరావతి, జనవరి 23: ఉద్యోగాల కల్పనతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర చెల్లించి, రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కోసం ప్రభుత్వమిచ్చే రాయితీలు దుర్వినియోగం చేసే ఆయా కంపెనీ యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

01/24/2018 - 02:54

పొన్నూరు, జనవరి 23: రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కాపులకు బీసీ (ఎఫ్) సర్ట్ఫికెట్ మంజూరు చేసినప్పుడే అసలైన రిజర్వేషన్ వర్తింప చేసినట్లవుతుందని కాపునాడు కన్వీనర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే శాసనసభ, శాసనమండలి ఆమోదంతో పాటు గవర్నర్ సంతకం కూడా చేశారన్నారు.

01/24/2018 - 02:52

విజయవాడ (క్రైం), జనవరి 23: పోలీసుశాఖలోని ప్రతి పోలీసుకు సొంత ఇంటి కల నిజం చేయాలన్నదే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్‌మీరా అన్నారు. రాష్ట్రంలోని పోలీసులందరికీ క్వార్టర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇస్తే కొంత లోనుతో పోలీసు సొంత ఇంటి కల నిజం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

01/24/2018 - 02:51

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో కల్తీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాల నియంత్రణకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. మద్యం తయారీ నుంచి పంపిణీ, నిలువ, విక్రయం వరకు ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లో నడిచేలా అన్ని మద్యం దుకాణాల్లో ‘హెడానిక్ పాత్ ఫైండర్ సిస్టిం’ (హెచ్‌పిఎఫ్‌ఎస్)ను విధిగా ప్రతి మద్యం దుకాణంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. సుమారు రూ.

01/24/2018 - 02:50

అమరావతి, జనవరి 23: చేతికొచ్చిన పంటకు తగు విధంగా గిట్టుబాటు ధర వచ్చి రైతే పూర్తి ప్రయోజనం పొందేలా గట్టి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. దావోస్ నుంచి అధికారులతో మంగళవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దావోస్‌లో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రైతుల విషయంలో ప్రత్యేకంగా అధికారులతో సమాలోచనలు చేస్తూ ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.

Pages