S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/05/2017 - 04:33

అనంతపురం అర్బన్, డిసెంబర్ 4: అనంతపురం నగర శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీనీ ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ గణేష్(33), లారీ క్లీనర్ రామ్‌విలాస్ రావత్(27) అక్కడికక్కడే మృతి చెందారు.

12/05/2017 - 04:33

సాలూరు, డిసెంబర్ 4: ముక్కుపచ్చలారని గిరిజన అనాధ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఫాస్టర్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్న వైట్ హౌస్ చిల్డ్రన్ హోం నిర్వాహకుడి రాసలీలలను అక్కడ ఉన్న బాలికలే బయటపెట్టారు. గత కొన్నాళ్లుగా తమను హోం నిర్వాహకుడు ప్రసాదకుమార్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపారు.

12/05/2017 - 00:27

విజయవాడ, డిసెంబర్ 4: ఈ ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌లో బదిలీ కోరుకుని, రిలీవర్ లేని కారణంగా బదిలీకి నోచుకోని ఉపాధ్యాయులను ఈ నెల 12లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ కమిషనర్ కే సంధ్యారాణి ఆర్‌సీ నెం 1882 ఉత్తర్వులను సోమవారం జారీ చేసారు.

12/05/2017 - 00:26

విజయవాడ, డిసెంబర్ 4: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో నిర్వహిస్తున్న ‘ భారతావనిని తెలుసుకోండి’ కార్యక్రమానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. భారతీయ మూలాలు కలిగిన ప్రవాస యువతకు నిర్దేశించిన ఈ వినూత్న కార్యక్రమం భారతీయ జీవనం, సంస్కృతి, కళలు వంటి వాటిని వారికి పరిచయం చేయనుంది. మంగళవారం నుండి తెలుగునాట ఈ బృంద సభ్యులు పర్యటించనున్నారు.

12/05/2017 - 00:26

విజయవాడ, డిసెంబర్ 4: దశాబ్దాలుగా నష్టాల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న ఎపీఆర్ ఆర్టీసీని లాభాలు కాకపోయినా కనీసం నష్టాలను తగ్గించేందుకై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం మాలకొండయ్యలు చేపట్టిన సంస్కరణలు కొంతమేర ఫలితాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ నష్టాలు వెంటాడుతునే ఉన్నాయి.

12/05/2017 - 00:25

విజయవాడ, డిసెంబర్ 4: వివిధ పథకాలకు సంబంధించి కొనుగోళ్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాఙనం ఉపయోగించుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ రామాజంనేయులు తెలిపారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సిస్టమేటిక్ ట్రాకింగ్ ఆఫ్ ఎక్సేంజెస్ ఇన్ ప్రొక్యూర్‌మెంట్ (స్టెప్) శిక్షణా కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించారు.

12/05/2017 - 00:25

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్‌బీఎస్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిన వేమూరి ఆనంద సూర్య తెలిపారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు ఆర్‌బీఎస్ ఏర్పాటైందని తెలిపారు.

12/05/2017 - 00:24

విజయవాడ (పటమట) డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు సోమవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి దేరి వెళ్ళారు. బ్రెజిల్, చిలీ, పెరూ దేశాలలో పార్లమెంటరీ వ్యవస్ధను ఆయన ఆధ్యయనం చేస్తారు. ఈ నెల 5,6 7 తేదీలలో బ్రెజిల్‌లోని రియోడిజనెరియోలో పర్యటిస్తారు. 8,9 తేదీలలో పెరూ రాజధాని లిమా నగరంలో, 10,11 తేదీలలో చిలీ రాజధాని సాంటియాగోను సందర్శిస్తారు.

12/05/2017 - 00:24

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ముసాయిదా రూపకల్పనకు మంత్రుల బృందాన్ని సోమవారం నియమించింది. ఈ బృందంలో వ్యవసాయ, పరిశ్రమల, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల మంత్రులు ఉంటారు. హార్టికల్చర్ శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

12/05/2017 - 00:23

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందచేసింది. ఎపీపీఎస్సీ తదితర సంస్థల ద్వారా ఉద్యోగాల్లో నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పొడిగించింది. 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు వయోపరిమితిని గతంలో పెంచింది. పొడిగింపు గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసింది. దీంతో ఆ గడువును వచ్చే సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages