S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/04/2017 - 03:38

అమరావతి, డిసెంబర్ 3: ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలకూ విస్తరింపజేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధిదీపాల పథకం ద్వారా దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంధనం ఆదా ద్వారా ఆర్థిక లబ్ధితో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు సిద్ధవౌతోంది.

12/04/2017 - 03:37

తిరుపతి, డిసెంబర్ 3: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీప మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్తీక పున్నమినాడు సా. 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో ఉపాలయమైన యోగ నరసింహస్వామి ఆలయం పక్కనున్న పరిమళ అరవద్ద 100 కొత్త మూకుళ్లలో నేతి దీపాలు వెలిగించారు.

12/04/2017 - 03:35

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 3: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు.

12/04/2017 - 03:31

డీ.హీరేహాల్, డిసెంబర్ 3 : అనంతపురం జిల్లాలోని కర్నాటక సరిహద్దు మండలాల్లో గత పదిరోజుల నుంచి కర్నాటక నుంచి వచ్చిన రెండు మగ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏనుగుల దాడిలో ఇప్పటికే జిల్లాలో ఒకరు మృతిచెందగా ఆదివారం డీ.హీరేహాల్ మండలం మురిడి గ్రామంలో రైతు గొల్ల ఏకాంతప్ప(45) మృతిచెందాడు. వివరాలు.. కణేకల్లు, డీ.హీరేహాల్ మండలాల్లో గత రెండు రోజుల నుంచి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

12/04/2017 - 03:31

కర్నూలు, డిసెంబర్ 3 : వైకాపా అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం నాటితో కర్నూలు జిల్లాలో ముగిసింది. జగన్ రాత్రికి పత్తికొండ నియోజకవర్గంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దు గ్రామమైన చెరువుతండాలో బస చేశారు. కర్నూలు జిల్లాలో 19 రోజుల పాటు నడక సాగించిన ఆయన సుమారు 272 కి.మీ మేర ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టారు.

12/04/2017 - 03:25

విజయవాడ, డిసెంబర్ 3: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 2.20 గంటలకు ఆయన సియోల్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. తొలుత భారత రాయబారి విక్రమ్ దొరైస్వామితో భేటీ అవుతారు. 6.15 గంటలకు కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. 6.50 గంటలకు దాసన్ నెట్‌వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూతో సమావేశమవుతారు.

12/04/2017 - 03:25

గంగాధరనెల్లూరు, డిసెంబర్ 3: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని పెద్దదామరగుంట గ్రామంలో శోభనం రాత్రి నూతన వధువును పాశవికంగా గాయపర్చిన ఘటనలో భర్త రాజేష్ (26)ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు.

12/04/2017 - 03:24

మడకశిర, డిసెంబర్ 3 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో విలేఖరులతో మాట్లాడారు.

12/04/2017 - 03:08

ఒంగోలు, డిసెంబర్ 3: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదగాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2017ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు.

12/04/2017 - 03:00

అనంతపురం, డిసెంబర్ 3: రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మంత్రి వర్గం నిర్ణయించడం పట్ల గిరిజనులు భగ్గుమన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం నగరంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడికి యత్నించారు. మరోవైపు వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడాన్ని అభినందిస్తూ ఆయా సంఘాల నేతలు మంత్రి కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు.

Pages