S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/24/2017 - 02:18

విజయవాడ, అక్టోబర్ 23: శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్ బాధిత ప్రజానీకానికి పునరావాస పునర్నిర్మాణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని అంతవరకు, ఏ ఒక్క కుటుంబాన్ని వారి వారి నివాస గృహాల నుంచి తరిమివేయవద్దంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహిరంగ లేఖ రాశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని రకాల పరిహారాలను అందచేయాలన్నారు.

10/24/2017 - 02:16

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లోని 77 మండలాల్లో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జిల్లా, మండల అత్యవసర కేంద్రాల సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐఎండి డిజిఎం కెజె రమేష్‌తో కలసి సమీక్ష అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

10/23/2017 - 03:56

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: బీసీలు ఐకమత్యంగా ఉంటేనే సామాజికాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలంతా ఒకే కులమనే భావజాలం రావాలని, మన ఓటు మన కులానికే అనే ఐక్యత రావాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బీసీ గర్జన కార్తీక సమారాధన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

10/23/2017 - 03:54

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: వన్యప్రాణులును వేటాడటానికి వచ్చిన వేటగాడు అటవీ శాఖ సిబ్బంది నుండి తప్పించుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతి aచెందాడు. అటవీ శాఖ గార్డుకు సహాయకునిగా వెళ్లిన ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం దేవీపట్నం మండలంలోని నాగళ్లపల్లి వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి...

10/23/2017 - 04:12

అనంతపురం, అక్టోబర్ 22 : 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగుతుందని, తద్వారా రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఏపిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. టిడిపి, బిజెపి పాలనలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ఏపిలో సిఎం చంద్రబాబు, కేంద్రంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందని వ్యాఖ్యానించారు.

10/23/2017 - 03:50

కడప, అక్టోబర్ 22 : 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. అధికార టిడిపి అధిష్ఠానం జిల్లాలో గత కొంతకాలంగా చేపట్టిన సర్వేల్లో ప్రస్తుతం ఉన్న నేతల పనితీరుకు బి గ్రేడ్ వచ్చింది.

10/23/2017 - 03:49

సీలేరు, అక్టోబర్ 22: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని పట్టపగలే హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ స్పిల్వే లాంచ్‌ఘాట్ వద్ద బోటులో ఆపరేటర్‌గా విధులు నిర్వహించే పాంగి సోమ అనే గిరిజనుడిని ఆదివారం ఉదయం సాయుధులైన ఐదుగురు మావోయిస్టులు తుపాకీతో కాల్చిచంపారు.

10/23/2017 - 03:48

తెనాలి, అక్టోబర్ 22: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎఎస్‌ఐ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామానికి చెందిన ఓగిబోయిన సామ్రాజ్యం (57) 1984లో పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరారు. 2014 సెప్టెంబర్ నుండి కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు.

10/23/2017 - 03:47

విజయవాడ, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు దేశంలో సహకార రంగంలోని అర్బన్ బ్యాంక్‌ల మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న సహకార బ్యాంక్‌లను ఏదోవిధంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

10/22/2017 - 04:00

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: రాష్ట్రంలో పోలీసుల కరకుతనం పోవాలి.. పోలీసుశాఖలో అలనాటి బ్రిటీషు విధానాలకు స్వస్తి పలకాలని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్పు అనేది సహజధర్మమని పదే పదే ఉటంకించిన ఆయన రాష్ట్ర పోలీసులు సేవా దృక్పధంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

Pages