S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/21/2017 - 04:07

ఆనందపురం, అక్టోబర్ 20: విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలో దీపావళి నాడు విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నేలబావిలో పడి దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ముచ్చెర్లకు చెందిన వంగలపూడి రాము (35), బంటుపల్లికి చెందిన యడ్ల రాము (30) బావ బావమరుదులు.

10/21/2017 - 04:06

అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర అనుమతిపై సీబీఐ కోర్టు ఏవిధంగా స్పందిస్తుందన్న ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో పెరుగుతోంది. దీనికి సంబంధించిన పరిణామాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 2 నుంచి 6 నెలల పాటు రాష్టవ్య్రాప్తంగా పాదయాత్ర జరుగుతుందని జగన్ ప్రకటించారు.

10/21/2017 - 04:06

విశాఖపట్నం, అక్టోబర్ 20: గత కొద్ది రోజులుగా భయాందోళనలకు గురిచేసిన వాయుగుండం గురువారం రాత్రి ఒడిశా సమీపంలోని పారాదీప్ వద్ద తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్ర అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఇది ప్రస్తుతం ఉత్తర ఒడిశా - జార్ఖండ్‌ల మధ్య జంషెడ్‌పూర్‌కు 85 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.

10/21/2017 - 04:05

భీమవరం, అక్టోబర్ 20: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రెండు పతకాలు సాధించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన నేషనల్ డిజైన్ రీసెర్చ్ ఫోరం (ఎన్‌డిఆర్‌ఎఫ్) జాతీయ స్ధాయి డిజైన్ పోటీలలో పర్యావరణ విభాగంలో రజతం, వ్యవసాయ ఇంజనీరింగ్‌లో కాంస్య పతకాలను సాధించారు.

10/21/2017 - 00:15

విజయవాడ, అక్టోబర్ 20: గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి (94)మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న బాబు.. గవర్నర్ నరసింహన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. కాగా, మంత్రి లోకేష్ స్వయంగా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు తన సానుభూతి వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

10/21/2017 - 00:14

విజయవాడ, అక్టోబర్ 20: విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలన్నీ ఏకమై పిడికిలి బిగించాయి. ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, వైఎస్సార్ ఎస్‌యు, తదితర విద్యార్థి సంఘాలన్నీ శుక్రవారం విజయవాడలో సమావేశమై ఈనెల 21 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఇతరత్రా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.

10/21/2017 - 00:14

విజయవాడ, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును మరో పది రోజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్‌కు సంబంధించి ఒక ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే.

10/21/2017 - 00:13

విజయవాడ, అక్టోబర్ 20: 2017 సంవత్సరానికి సంబంధించి ప్రతిభా అవార్డుల విజేతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. వెబ్‌సైట్‌ను పరిశీలించి, విజేతల వివరాలను ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 30తేదీలోగా పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కమిషనర్ కోరారు.

10/21/2017 - 00:13

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10వ వేతన సవరణకు సంబంధించిన 10 నెలల బకాయిల చెల్లింపుపై త్వరలోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర ఈ విషయాన్ని తెలియచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జెఎసి అధ్యక్షుడు పి.అశోక్ బాబు తెలిపారు.

10/21/2017 - 00:12

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమర్‌నాథ్‌రెడ్డి శుక్రవారం దక్షిణ కొరియా జియోంగి ప్రావిన్స్‌లోని గాగన్ గ్రామంలో ఆ ప్రాంత అగ్రికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు ‘లీ’తో కలిసి అక్కడి వరి పొలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అత్యాధునిక పద్ధతులతో అధిక దిగుబడి సాధిస్తున్న తీరును, స్థానికంగా అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు గురించి అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.

Pages