S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/20/2017 - 12:16

తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలనిడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 87,516 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

02/20/2017 - 08:17

నెల్లూరు, ఫిబ్రవరి 19: ‘నెల్లూరు’ అనే పేరులోనే

మంచి ధాన్యాన్ని దాచుకున్న నెల్లూరు డెల్టా ప్రస్తుత

పరిస్థితి దైన్యంగా మారుతోంది. ఒకప్పుడు వరి

వంగడాల కోసం నెల్లూరులో ఇతర ప్రాంతాల రైతులు

క్యూ కట్టేవారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ, తూర్పు

కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ధాన్యం సరఫరాలో

నెల్లూరు డెల్టా రైతులదే కీలక భూమిక. కాని

02/20/2017 - 08:16

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19: గోదావరి నది ఎడమ

గట్టుపై పురుషోత్తపట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకం

ఇంకా భూసేకరణ దశ నుంచి బయటపడలేదు. ఈ

ప్రాజెక్టు కింద భూములు కోల్పోయేదంతా సన్న,

చిన్నకారు రైతులే. ఈ భూములపై ఆధారపడిన

కౌలు రైతుల్లో తమ ఉపాధి కోల్పోతున్నామనే బెంగ

నెలకొంది. పొలాలు పోతే మా బతులకు భరోసా

02/20/2017 - 08:23

‘అనంత’కు 26 టిఎంసిల పంపింగ్
శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం

అనంతపురం, ఫిబ్రవరి 19 : కర్నూలు, అనంతపురం

జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు

ఏర్పాటు చేసిన హంద్రీనీవా సుజల స్రవంతి

(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువకు కృష్ణా జలాలు

ఆగిపోయాయి. ఇందుకు శ్రీశైలం జలాశయంలో నీటి

మట్టం 837 అడుగులకు పడిపోవడమే కారణం.

02/20/2017 - 06:57

అనంతపురం జిల్లాలో విచిత్రం జరిగింది. కరవు నేలలో పాతాళ గంగ పెల్లుబికింది. అన్నదాతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో రైతు శ్రీనివాసాచారి తన పొలంలో నాలుగు బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు పడలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఐదో బోరు తవ్వించాడు. 570 అడుగుల లోతులో నీరు పుష్కలంగా పడింది.

02/20/2017 - 06:54

అమరావతి, ఫిబ్రవరి 19:పార్టీ మారిన వారిని సమన్వయం చేసుకుని పనిచేయాలన్న టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. మొదటినుంచి పనిచేస్తున్న వారిని పక్కకుపెట్టి, కేవలం జగన్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న వ్యూహంలో భాగంగా, ఆ పార్టీవారిని చేర్చుకుని పెద్దపీట వేస్తున్న వైనం టిడిపి నేతలకు మింగుడుపడటం లేదు.

02/20/2017 - 06:48

మహిళా పార్లమెంట్ ఉదంతంపై కోడెల
నా వ్యాఖ్యల వక్రీకరణ దారుణం
వారిపై చర్యలు తప్పవన్న సభాపతి
మార్చి 3నుంచి బడ్జెట్ సమావేశాలు

02/20/2017 - 06:42

48 గంటలపాటు నిర్బంధం
వీడియోలు తీసి బెదిరింపులు
ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం
గుంటూరులో బాధితుల రాస్తారోకో

02/19/2017 - 07:45

గుంటూరు, ఫిబ్రవరి 18: నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాల ఆధునీకరణకు రాజకీయ గ్రహణం పట్టింది. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగటంలేదు. మట్టి పనులతోనే ఏటా సరిపెడుతున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ప్రతి ఏటా ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందకపోగా వరద ముంపుతో ఊళ్లు సెలయేళ్లులా మారుతున్నాయి.

02/19/2017 - 07:44

కాకినాడ, ఫిబ్రవరి 18: ఏపి ఎంసెట్-2017ను తొలిసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ బాధ్యతలను టిసిఎస్, ఏపి ఆన్‌లైన్‌కు ప్రభుత్వం అప్పగించింది. కాకినాడ జెఎన్‌టియు ప్రవేశ పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలను వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 39 ప్రవేశ పరీక్షా కేంద్రాలను, అలాగే హైదరాబాద్‌లో మరో 3 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.

Pages