S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/27/2017 - 04:36

అమరావతి, జనవరి 26: సత్వర పారిశ్రామికాభివృద్ధి - సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం వేదిక కానుంది.

01/27/2017 - 04:36

విజయవాడ, జనవరి 26: స్వాతంత్య్రానంతరం నుంచి డిఎంఇ కార్యాలయం పరిధిలోనున్న ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లుల పరిశీలన, చెల్లింపు పూర్తిగా ఆ కార్యాలయం నుంచి తొలగించబడి కొత్తగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పరిధిలోకి చేరింది.

01/27/2017 - 04:35

కడప, జనవరి 26: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని, 15 ఏళ్లు ప్రత్యేక హోదాకావాలని మొదట డిమాండ్ చేసింది చంద్రబాబే అని శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య అన్నారు. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

01/27/2017 - 04:34

విజయవాడ, జనవరి 26: రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడమే జగన్ లక్ష్యమని, ఆయన కుట్రలో ప్రజలు భాగస్వాములు కావద్దని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. రెండున్నరేళ్ల పాలనా కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ. 2లక్షల 60వేల కోట్ల పెట్టుబడులను గ్రౌండ్ చేయించి 3లక్షల 61వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిందని తెలిపారు.

01/27/2017 - 04:34

మార్కాపురం, జనవరి 26: 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యశాల ఎదుట జెండాను ఏర్పాటు చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ గురై ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది.

01/27/2017 - 03:40

అమరావతి, జనవరి 26: గుంటూ రు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిశోర్‌బాబుపై వేటు తప్పదా? ఆయన అత్యుత్సాహాన్ని నాయకత్వం భరించలేకపోతోందా? చివరకు తనకు గాఢ్‌ఫాదర్ అని ప్రచారం చేసుకునే పార్టీ యువనేత లోకేష్ కూడా మంత్రి వ్యవహారశైలితో విసిగిపోయారా? తాజాగా సెక్యూరిటీని విడిచి రెండుగంటల పాటు మాయమైన వైనం ప్రభుత్వం-పార్టీ పరువు తీసిందా? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది.

01/27/2017 - 03:32

చిత్రం..ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం జివిఎంసి
గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు

01/26/2017 - 08:31

అమరావతి, జనవరి 25: మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే ఇకపై కఠినంగా వ్యవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమర్థవంతంగా పనిచేయకపోతే వచ్చిన సమస్యలకు తాను ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తవారిని వెతుక్కుంటానని స్పష్టం చేశారు.

01/26/2017 - 08:30

కడప, జనవరి 25: కడప జిల్లా పులివెందుల మున్సిపల్ చైర్మన్ ప్రమీలమ్మ వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

01/26/2017 - 08:24

విశాఖపట్నం, జనవరి 25: అందరి దృష్టి విశాఖ పైనే ఉంది. మొన్నటి వరకూ అంతగా పట్టించుకోని ప్రత్యేక హోదా ఉద్యమం ఒక్క సారిగా ఊపిరిపోసుకుంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో అనుకున్నది సాధించుకున్న తమిళుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సమాయత్తం కావడం, దీనికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంటోంది.

Pages