S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/27/2017 - 05:15

శ్రీకాకుళం, జనవరి 26: ప్రత్యేక హోదా డిమాండ్‌తో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన వైకాపా జిల్లా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మానను జిల్లా కార్యాలయం ప్రధాన గేటును కూడా దాటనివ్వకుండా పోలీసులు నిలిపివేశారు.

01/27/2017 - 05:12

విశాఖపట్నం, జనవరి 26: జల్లికట్టు కోసం తమిళ ఉద్యమం జరిగిన తీరులో ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వైకాపా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగా విశాఖ రామకృష్ణా బీచ్‌లో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఈ నిరసన కార్యక్రమాని వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీలు మద్దతు ఇచ్చాయి.

01/27/2017 - 05:10

విశాఖపట్నం, జనవరి 26: ప్రత్యేక హోదా సాధనకై వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజరేయ్యందుకు వచ్చిన ఆపార్టీ అధినేత జగన్‌ను విమానాశ్రయంలోనే నిర్బంధించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, మానవహారాలు నిర్వహిస్తున్నట్లు వైకాపా రాష్ట్ర నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

01/27/2017 - 05:09

ప్రత్తిపాడు, జనవరి 26: ప్రభుత్వంపై పలు రూపాల్లో వత్తిడితెచ్చి, శాంతియుతంగా, గాంధేయమార్గంలోనే ఆందోళనలు చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని కాపు రిజర్వేషన్ల జెఎసి సమావేశం తీర్మానించింది. ప్రత్తిపాడులోని కాపు ఉద్యమనేత ముద్రగడ నివాసంలో గురువారం సమావేశమైన కాపు జెఎసి నేతలు ఈ మేరకు తీర్మానించారు.

01/27/2017 - 05:18

విజయవాడ, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి ఇంకా ప్రజల్ని వంచిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిర్వహిస్తున్న వౌనదీక్షకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కల్పించారని, బిజెపి, టిడిపినే ప్రజల ముందు దోషులుగా నిలిచాయని అన్నారు.

01/27/2017 - 05:08

రాజమహేంద్రవరం, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నాలుగు వేల మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండా రెపరెపలాడింది. నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో ఈ భారీ పతాకాన్ని రూపొందించారు. వేలాది మంది విద్యార్థులు ఈ పతాకాన్ని చేతబూని జరిపిన ప్రదర్శనను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు.

01/27/2017 - 04:58

నాయుడుపేట, జనవరి 26: నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో గణతంత్ర వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం బైటపడింది. అతి పవిత్రంగా జరుపుకునే గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు ఆర్డీవో శీనానాయక్ సాక్షిగా అవమానం జరిగింది. ఆర్డీవో కార్యాలయంలో త్రివర్ణ పతాకం జెండా వందన కార్యక్రమానికి ఉదయం 8 గంటల సమయంలో మండల పరిధిలోని రెవెన్యూ అధికారులు హాజరైనారు.

01/27/2017 - 04:49

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 26: ప్రశాంతతకు నిలయమైన విశాఖపట్నంలో బందులు, రాస్తారోకోలకు పిలుపునిచ్చి ప్రశాంతతను భగ్నం చేయటం తగదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు.

01/27/2017 - 04:41

అమరావతి, జనవరి 26: ప్రజా సమస్యలపై తెల్లవారక ముందే కోడై కూసే నెటిజన్లు తీరా వాటిపై జరిగే ఉద్యమాలకు మాత్రం దూరంగానే ఉంటారన్న విషయం మరోసారి నిజమైంది. సమర్ధుడైన పట్ట్భద్రులను, నిస్వార్ధపరులైన ఎమ్మెల్యేలనే ఎన్నుకోవాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చే విద్యావంతులు, అసలు ఎన్నికల్లో ఓట్లే వేయడం లేదన్న వాస్తవం వరసగా రుజవవుతూనే ఉంది. పట్ట్భద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యల్పం కావడమే దానికి నిదర్శనం.

01/27/2017 - 04:38

విజయవాడ, జనవరి 26: దేశ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని చాటేలా దేశభక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులు కె జయరావ్ ఉద్యోగులకు ఉద్బోధించారు. 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని సమాచార, పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర సమాచార కేంద్రంలో సహాయ సంచాలకులు జయరావ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Pages