S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/01/2016 - 12:26

నెల్లూరు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలను గాలికొదిలేసి ఎపి సిఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని సిపిఎం నేత మధు విమర్శించారు. జనం దృష్టిని మరలించేందుకు చేపడుతున్న నవ నిర్మాణ దీక్షలను తమ పార్టీ వ్యితిరేకిస్తోందన్నారు. కాలక్షేపానికి తప్ప ఇలాంటి దీక్షల వల్ల జనానికి ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

06/01/2016 - 12:26

విజయవాడ: ఎపి మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. ఈ నెల 2న జరిగే నవనిర్మాణ దీక్ష, రెండేళ్ల పాలన, కొత్తగా ఉద్యోగ నియామకాలు, వివిధ సంస్థలకు స్థలాల కేటాయింపు, రాజధాని నిర్మాణం, హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొత్త పథకాలకు రూపకల్పన వంటి పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోందని సమాచారం.

06/01/2016 - 12:25

చిత్తూరు: అదుపు తప్పిన వ్యాన్ పాదచారులపై దూసుకుపోవడంతో ముగ్గురు మరణించిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం జరిగింది. మృతులను గౌరమ్మ, ఉదయ్, శ్రీనివాస్‌గా గుర్తించారు.

06/01/2016 - 12:25

విశాఖ: విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సమక్షంలో బుధవారం ఉదయం మహిళా మావోయిస్టులు కడబాల లక్ష్మి (సరిత), విజయ, కోనంగి రాములమ్మ (భరతక్క) లొంగిపోయారు. ఎపి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల్లో వీరిపై పలు కేసులున్నాయి. లక్ష్మి, రాములమ్మలపై 4 లక్షల రివార్డు ఉంది. మరికొంత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.

06/01/2016 - 12:24

విశాఖ: డ్యూటీ విషయమై ఎఆర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మధ్య వివాదం ఘర్షణకు దారితీసిన సంఘటన ఇక్కడ బుధవారం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఎస్‌ఐని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్మార్వో ఆఫీసులో విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ వాసుపల్లి అమ్మోరును ‘డ్యూటీ వదిలి ఎక్కడికి వెళ్లావు’అని ఎస్‌ఐ భగవాన్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.

06/01/2016 - 12:24

విశాఖ: అనకాపల్లి వద్ద శారదా నది నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తరలిస్తే తాము సహించేది లేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హెచ్చరించారు. నీటి తరలింపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం ఆయన తుమ్మపాల వద్ద రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతుల ప్రయోజనాలను కాదని నీటిని తరలించాలనుకోవడం దారుణమన్నారు.

06/01/2016 - 12:24

విశాఖ: తన పదవీ కాలం (మరో మూడేళ్లలోగా) పూర్తయ్యేనాటికి విశాఖకు రైల్వే జోన్‌ను తప్పకుండా సాధిస్తానని స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు బుధవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎపి నుంచి రాజ్యసభకు పంపడానికి, రైల్వే జోన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సురేష్ ప్రభు వల్ల విశాఖ ప్రాంతానికి మేలు జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.

06/01/2016 - 06:53

హైదరాబాద్, మే 31: నాలుగో అభ్యర్థి బరిలో ఉంటారా? లేరా? ఒకవేళ ఉంటే క్యాంపుల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో ఎలా ఓట్లు వేయిస్తారు? ఇదీ మంగళవారం ఉదయం వరకూ టిడిపి, వైసీపీ నేతలను ఉత్కంఠ పరిచిన అంశం. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి పోటీపై టిడిపి నాయకత్వం సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఉత్కంఠను కొనసాగించి, చివరకు ముగ్గురితోనే కథ ముగించింది.

06/01/2016 - 06:49

పార్వతీపురం, మే 31: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపాన గల ఉజిడితల్లి వీధిలో ఐదేళ్ల మైనర్ బాలికపై పక్కనే ఉన్న జనతావీధికి చెందిన 55 ఏళ్ల అన్నాబత్తుల బాబూరావు కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. చాలారోజుల నుంచి ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నా అవగాహన లేని ఆ అమ్మాయి చివరకు తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది.

06/01/2016 - 06:48

విజయవాడ (బెంజిసర్కిల్), మే 31: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

Pages