S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/20/2016 - 03:05

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మరోసారి పెద్ద పీట వేసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు పౌష్ఠికాహారం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 55,581 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో లక్షా 4వేల మందికి పైగా అంగన్‌వాడీ వర్కర్లు పని చేస్తున్నారు. 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో స్ర్తి, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 1331.73 కోట్లు కేటాయించింది.

11/20/2016 - 03:05

హిందూపురం/పరిగి, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఆ చిరు వ్యాపారి ప్రాణాలమీదికి తెచ్చింది. సరుకులు కొనుగోలుకు వచ్చిన వారు ఇచ్చిన పెద్దనోటు తిరస్కరించడంతో వారు కక్షగట్టి ఆ చిరువ్యాపారిపై బేడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

11/20/2016 - 03:04

గుంటూరు, నవంబర్ 19: రాజధాని అమరావతిలో లంక భూముల సమీకరణ వివాదాస్పదంగా మారుతోంది. కోర్ కేపిటల్‌కు నిర్దేశించిన లింగాయపాలెంలో 200 ఎకరాల లంక భూములను రాజధాని అవసరాలకు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని సమీకరించడం తగదని దళిత సంఘాల ఆధ్వర్యంలో రైతులు వ్యతిరేకించారు. నష్టపరిహారం ప్యాకేజీ తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

11/20/2016 - 03:03

విజయవాడ (క్రైం), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంధ్యాలలో చోటు చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ఆత్మహత్య కేసు విచారణ ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు.

11/20/2016 - 03:02

ఒంగోలు,నవంబర్ 19:ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్దపోలీసులు శనివారం ఉదయం ఒక కారులో సోదాలు చేయగా ఎటువంటి పత్రాలు లేని 65లక్షల రూపాయలు కన్పించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును విజయవాడలోని డిప్యూటీ ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌కు పంపించారు.

11/20/2016 - 03:02

కర్నూలు, నవంబర్ 19: బిటెక్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య సంఘటన నుంచి తేరుకోక ముందే కర్నూలు జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లోక్‌నాథ్‌చౌదరి(17) శనివారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

11/20/2016 - 03:01

పలమనేరు, నవంబర్ 19: ఆడుకుంటూ వీధిలోకివెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో ఎస్సై కుటుంబంలో ఆందోళన చెందుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు బైరెడ్డిపల్లె ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమోహన్ పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అన్నతో ఆడుకుంటూ శరత్‌కుమార్(3) వీధిలోకి వెళ్లాడు.

11/19/2016 - 04:08

నెల్లూరు, నవంబర్ 18: ‘నేను తప్పు చేసినా జైలులో పెట్టించేందుకు మా నాన్న ఆలోచించడు. మా పార్టీలోని వ్యక్తులు ఎవరు తప్పు చేసినా జైలుకెళ్లాల్సిందే ’ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

11/19/2016 - 04:06

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేణుగోపాలస్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. తొలుత ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభామండపంలోని సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధిని రకరకాల పుష్పాలతో అలంకరించారు.

11/19/2016 - 04:04

విశాఖపట్నం, నవంబర్ 18: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉన్నట్టే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సిఎస్) కార్డు కలిగి ఉండేలా చూడాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో జరిగిన ఉత్తమ సేవా అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Pages