S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/29/2016 - 04:07

గుంటూరు, అక్టోబర్ 28: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

10/29/2016 - 00:11

విజయవాడ, అక్టోబర్ 28: ప్రత్యేక ప్యాకేజీతో వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది దేశంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి సన్మానం జరిగింది. కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని గురించి రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలన్నారు.

10/29/2016 - 00:09

విజయవాడ, అక్టోబర్ 28: రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు తరలివస్తున్నాయి. 53,100 మందికి ఉపాధి కల్పించే నాలుగు మెగా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

10/29/2016 - 00:07

ఏలూరు, అక్టోబర్ 28 : పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పి కార్యాలయం ప్రాంగణంలోని ఆయుధ మరమ్మతు కేంద్రంలో శుక్రవారం ఒక రైఫిల్ మిస్‌ఫైర్ కావడంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. వివరాలిలా వున్నాయి. జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలోనే ఆయుధ మరమ్మతు కేంద్రం వుంది. శనివారం జిల్లాలో ఫైరింగ్ రేంజ్ కార్యక్రమం జరగనున్న నేపధ్యంలో శుక్రవారం ఈ కేంద్రంలో ఆయుధాల పరిశీలన, మరమ్మతులు చేపట్టారు.

10/29/2016 - 00:05

గుంటూరు, అక్టోబర్ 28: ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కె స్వగ్రామం తుమృకోటలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఒకానొకప్పుడు పోలీసులకు సవాల్ విసిరిన జిల్లాకు చెందిన మావోయిస్టు ముఖ్యనేతలు దాదాపు ఏఒబిలోనే తలదాచుకుంటున్నట్లు సమాచారం.

10/29/2016 - 00:03

అమరావతి, అక్టోబర్ 28: కోర్ క్యాపిటల్‌లో ప్రభుత్వ భవనాల శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రధాని నరేంద్రమోదీని తలపించారు. కీలకమైన రెండు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా, జాతీయ విద్యాసంస్థలు, పరిశ్రమలు, జాతీయ రహదారుల విస్తరణకే పరిమితమవడం చర్చనీయాంశమయింది. జైట్లీ పర్యటనపై వివిధ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

10/29/2016 - 00:02

విజయవాడ, అక్టోబర్ 28: రహదారుల నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు బాధ్యత వహించాలని, నాసిరకం పనులతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే, ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై బహిష్కరణ వేటు వేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ రుణ సహాయంతో చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

10/29/2016 - 00:02

విశాఖపట్నం, అక్టోబర్ 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుపాను శుక్రవారం నాటికి మరింత బలహీనపడి దక్షిణ కోస్తాను ఆనుకుని అల్పపీడనంగా స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురు,మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీసే అవకాశం ఉందని తెలిపారు.

10/29/2016 - 00:01

నెల్లూరు,అక్టోబర్ 28: ఏడాది విరామం తర్వాత జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సమావేశం అరుపులు..కేకలు...గందరగోళం మధ్య శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగింది.

10/29/2016 - 00:00

కాకినాడ సిటీ, అక్టోబర్ 28: కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఒక రోజు వయసున్న ఆడ శిశువు అపహరణకు గురవ్వగా పోలీసుల జోక్యంతో గంటల వ్యవధిలోనే తల్లి ఒడికి చేరింది. రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి లక్ష్మి ప్రసవం కోసం మంగళవారం కాకినాడ జనరల్ ఆసుపత్రి మాతాశిశు విభాగంలో చేరింది. బుధవారం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Pages