S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/02/2016 - 03:19

అమరావతి, నవంబర్ 1: రుణాల మంజూరులో కాపులకు పెద్దపీట వేస్తున్న తెదేపా సర్కారు తీరుపై బీసీలు భగ్గుమంటున్నారు. కాపు-బీసీలు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీలు ప్రభుత్వ వైఖరిపై అటోఇటో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు ఇంత అన్యాయం జరుగుతున్నా బీసీ మంత్రులు పట్టనట్లు వ్యవహరిస్తున్న వైనంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

11/01/2016 - 07:26

అమరావతి, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు ఆశిస్తున్న పార్టీ శ్రేణులకు శుభవార్త. ప్రతిరోజూ గంటలకు గంటల టెలీకాన్ఫరెన్సులు, సమీక్ష సమావేశాలతో విసిగి వేసారిపోతున్న అధికారులకు ఊరట. ఇకపై తాను పార్టీకి పూర్తిస్థాయి సమయం కేటాయిస్తానని, సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్ విధానాల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు బాబు స్వయంగా ప్రకటించారు.

11/01/2016 - 07:25

ఏలూరు, అక్టోబర్ 31: ప్రముఖ సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వర శాస్ర్తీ (ద్వానా శాస్ర్తీ)కి ప్రతిష్ఠాత్మక మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కోటదిబ్బ వద్ద వున్న నేరెళ్ల రాజా కళ్యాణ మండపంలో సోమవారం గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.

11/01/2016 - 07:25

తోట్లవల్లూరు, అక్టోబర్ 31: మానవత్వం మంటగలిసింది. ఓ గృహిణి తన భర్తను కొడుకు, కోడలితో కలిసి అమానవీయంగా కడతేర్చింది. భర్త నోటిలో ఎండ్రిన్, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆ కుటుంబానికి పెద్దగా వ్యవహరించిన అతను కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో సోమవారం జరిగింది. యాకమూరులో శొంఠి ఏడుకొండలు (47)కి భార్య వీరకుమారి, కొడుకు వీరబాబు ఉన్నారు.

11/01/2016 - 07:24

హైదరాబాద్, అక్టోబర్ 31: పదో షెడ్యూలులో ఉన్న సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అడ్డం పడుతోందని, వెంటనే విభజనకు సహకరించాలని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. నిజాం రాజు నిర్మించిన భవనాలపై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్రప్రదేశ్‌కూ అంతే హక్కు ఉందని పేర్కొన్నారు.

11/01/2016 - 07:23

విజయవాడ, అక్టోబర్ 31: దేశంలో సులభతరంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం లభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన సంబంధిత విభాగాల సిబ్బందిని అభినందించారు. పారిశ్రామిక విధానం, అభివృద్ధి విభాగంచేపట్టిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఆంధ్రకు మొదటి స్ధానం లభించడం..

11/01/2016 - 06:47

విజయవాడ, అక్టోబర్ 31: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరి వాడని, అయితే బిజెపి ఆ మహానేత పేరును స్వప్రయోజనాలకు వాడుకుంటోందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. ఇక్కడి ఎపిపిసిసి భవన్‌లో సోమవారం రాత్రి జరిగిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ విస్మరించలేదన్నారు.

11/01/2016 - 06:46

దర్శి,అక్టోబర్ 31:నాలుగు సంవత్సరాల చిన్నారి బాలుడిపై సవతి తల్లిదాష్టికం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని శివరాజ్‌నగర్ గ్రామంలో కల్లూరి బ్రహ్మయ్య అనే నాలుగుసంవత్సరాల బాలుడిపై సవతితల్లి అట్లకాడతో పెట్టిన వాతలు,కొట్టిన దెబ్బలు మానవత్వాన్ని మంటగలిపేలా చేశాయి. కల్లూరి ఆంజనేయులు రాచూరి లక్ష్మి సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆంజనేయులకు నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నాడు.

11/01/2016 - 06:45

విజయవాడ, అక్టోబర్ 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకం పనులను మరింత వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేసిన ఆయన వర్షాలు తగ్గుముఖం పట్టినందున తవ్వకం పనులకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని, నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు.

11/01/2016 - 06:45

రాజమహేంద్రవరం, అక్టోబర్ 31: కార్తీక మాసం ప్రారంభమైన సోమవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కార్తీక మాసం ప్రారంభమైన రోజునే రావడంతో రెండు జిల్లాల్లోని గోదావరి తీరాల్లో తెల్లవారుజాము నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వదిలారు.

Pages