S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/30/2016 - 03:44

విశాఖపట్నం, అక్టోబర్ 29: విభజన అనంతరం రాష్ట్రం దాదాపు రూ.18వేల కోట్ల లోటుతో అల్లాడుతోంది. ఆర్థికంగ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో గతేడాది 10 శాతానికి పైబడి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి పైబడి వృద్ధి రేటు ఏలా సాధ్యమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

10/30/2016 - 03:57

కాకినాడ, అక్టోబర్ 29: రాష్ట్రంలో ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, భవన నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు నుండి సుమారు 3వేల కోట్ల రూపాయల నిధులు విడుదల కానున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

10/30/2016 - 03:39

విజయవాడ, అక్టోబర్ 29: ముస్లింలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు ప్రకటించారు. కర్నూలులో మూడు కోట్ల రూపాయలతో మినీ హజ్ హౌస్ నిర్మించనున్నట్లు క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం ప్రతినిధులకు తెలిపారు. హైదరాబాద్‌లో హజ్‌హౌస్ తన హయాంలోనే నిర్మించామని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

10/30/2016 - 03:32

వరదయ్యపాళెం, అక్టోబర్ 29: ప్రముఖ ఆధ్యాత్మిక గురువుకల్కి భగవాన్ ఆరోగ్యంగా ఉన్నారని, కల్కి ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు లోకేష్ దాసాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చెన్నై అపోలోలో క్రిటికల్ యూనిట్‌లో చికిత్స చేయిస్తున్నారని జరుగుతున్న ప్రచారం సత్యదూరం అన్నారు.

10/30/2016 - 03:31

విజయవాడ, అక్టోబర్ 29: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలపై సిఎం చంద్రబాబు ఎందుకు వౌనం వహిస్తున్నారని పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రశ్నించింది. ఈ మేరకు సిఎంకు శనివారం బహిరంగ లేఖను విడుదల చేశారు. హోం మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదని, డిజిపి సాంబశివరావు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది.

10/30/2016 - 03:30

విశాఖపట్నం, అక్టోబర్ 29: రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నీటి సరఫరా విభాగం సలహాదారు కొండలరావుతో విశాఖలో శనివారం భేటీ అయిన మంత్రి అయ్యన్న పలు అంశాలపై చర్చించారు.

10/30/2016 - 03:07

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం చేయకుండా నిధులు లేని ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పొగిడి ఐదు కోట్ల ఆంధ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానించారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

10/30/2016 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శంకుస్థాపనల పిచ్చి పట్టిందని ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి చంద్రబాబు ఏమీ ఒరగబెట్టకపోయినప్పటికీ శంకుస్థాపన పేరిట శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయనను కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు పొగడ్తలతో ముంచెత్తారని రఘువీరారెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

10/30/2016 - 03:03

రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: గోదావరి మహా పుష్కరాల్లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సివై సోమయాజులు కమిషన్ విచారణ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. సెప్టెంబర్ 29వ తేదీతో ముగిసిన మూడో విడత గడువును మళ్లీ మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017 జనవరి 29వ తేదీ వరకు నాలుగు నెలల పాటు పొడిగించింది.

10/30/2016 - 03:01

కాకినాడ, అక్టోబర్ 29: దళిత, గిరిజన మహాగర్జన కార్యక్రమాన్ని నవంబర్ 19న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్టీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం శివాజీ విలేఖరులతో మాట్లాడారు.

Pages