S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/29/2016 - 00:00

విశాఖపట్నం (గాజువాక), అక్టోబర్ 28: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) మొదటి ఐదు వందల మెగావాట్ల యూనిట్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం సింహాద్రిలో 1500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం రావాడ వద్ద ఎన్టీపీసీ నిర్మించిన సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.

10/28/2016 - 23:59

విజయవాడ, అక్టోబర్ 28: రసాయన ఎరువుల వినియోగం ఖరీఫ్‌లో 17 శాతం తగ్గిందంటూ రబీలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్యశాఖల అధికారులు పాల్గొన్నారు.

10/28/2016 - 04:05

మార్కాపురం, అక్టోబర్ 27: ఎఓబిలో జరిగిన సంఘటనతో కొంతకాలం నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో మావోయిస్టులు ఉన్నా లేకున్నా నల్లమల అటవీ ప్రాంతంలో నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నామని మార్కాపురం ఓఎస్‌డి కల్యాణలక్ష్మీ తెలిపారు.

10/28/2016 - 04:04

విజయవాడ, అక్టోబర్ 27: జాతీయ స్థాయిలో నాబార్డు తీసుకున్న నిర్ణయాలను, నిధుల విషయంలో వున్న నిబంధనలను ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, వారి అవసరాలకు తగినట్టుగా మార్చుకునే వీలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నాబార్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకైనా ఖర్చు పెట్టుకునేలా అవకాశం కల్పిస్తే నూరుశాతం ఫలితాలు చూపిస్తామని ఆయన తెలిపారు.

10/28/2016 - 04:02

విజయవాడ, అక్టోబర్ 27: నీటి లభ్యత ఆధారంగానే పంటల సాగు చేపట్టాలని, జలవనరుల, వ్యవసాయ శాఖాధికారులు జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. పంటల వేయని భూములకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ గ్రామాల వారీగా నివేదికలు అందచేయాలని ఆదేశించారు.

10/28/2016 - 04:01

గుంటూరు, అక్టోబర్ 27: జూనియర్ డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు తన వేధింపులే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి గైనకాలజీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎవివి లక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు మెడికల్ కళాశాలలో పిజి చేస్తున్న డాక్టర్ సంధ్యారాణి ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగా 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.

10/28/2016 - 04:00

రాజమహేంద్రవరం, అక్టోబర్ 27: ఒకసారి ఉప్పొంగి గలగల పారుతూ వేల టిఎంసిల వరద జలాలు సముద్రంలో కలిసిపోయే గోదావరి నది మరోసారి కనీసం పంట పండించడానికి కూడా సరిపోనంతగా ఎండిపోయి రైతుకు కంటనీరు తెప్పిస్తుంది. రాష్ట్రానికే జీవధార అయిన గోదావరి నది నుండి గత పదిహేనేళ్లలో సుమారు 4.5 లక్షల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఈ ఏడాదే ఇప్పటివరకు 2833 టిఎంసిల నీరు సముద్రంలో కలిసింది.

10/28/2016 - 03:58

కాకినాడ, అక్టోబర్ 27: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. ప్రజాసాధికార సర్వే పూర్తయిన అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

10/28/2016 - 03:56

నార్పల, అక్టోబర్ 27: జీవసమాధికి సిద్ధమైనట్లు ఓ అవధూత చేసిన ప్రకటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. గురువారం 4 గంటలకు తాను జీవసమాధి అవుతున్నట్లు నార్పల మండలం కురగానిపల్లి గ్రామానికి చెందిన అవధూత నర్సిరెడ్డి(92) ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, శిష్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నర్శిరెడ్డి గ్రామంలో పెద్ద మోతుబరి. 1973 సంవత్సరం నుండి ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లాడు.

10/28/2016 - 03:53

విజయవాడ, అక్టోబర్ 27: ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధుల వినియోగంపై కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం నత్తనడకన నడుస్తోందని, బీసీ సబ్ ప్లాన్ కింద రూ.8732 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకూ దాదాపు 1065 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

Pages