S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/01/2016 - 06:44

శ్రీకాకుళం, అక్టోబర్ 31: నెల రోజులపాటు టిడిపి నిర్వహించే జన చైతన్య యాత్రల నేపథ్యంలో మంత్రులకు మూడంచెల భద్రత కల్పించాలని రాష్ట్ర హోంశాఖ వౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

11/01/2016 - 06:43

గుంటూరు, అక్టోబర్ 31: రాజధానిలో మరోవిడత భూసేకరణకు రంగం సిద్ధమైంది. భూసమీకరణ ద్వారా ఇప్పటివరకు 33వేల 500 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందించారు. అయితే మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండల పరిధిలోని మరికొందరు రైతులు సమీకరణను వ్యతిరేకించటంతో ప్లాట్ల కేటాయింపు, అభివృద్ధి పనులకు స్థలాలు, రాజధాని నిర్మాణం, తదితర అంశాల్లో ప్రభుత్వానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.

11/01/2016 - 06:42

విశాఖపట్నం, అక్టోబర్ 31: జెజ్జంగి ఎన్‌కౌంటర్ మొత్తం వివాదాస్పదమైంది. ఇప్పటికే ఆ ఎన్‌కౌంటర్ బూటకమని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలపై పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నారు. అదేవిధంగా మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మిస్సింగ్ పోలీసుల తలకు చుట్టుకుంది. ఆర్కే భార్య ఏపి హైకోర్టులో అబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆర్కే విషయంలో పోలీసులు గుక్క తిప్పుకోలేకపోతున్నారు.

11/01/2016 - 06:31

తిరుపతి, అక్టోబర్ 31: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని టిటిడి అద్దె గదులకు కూడా కాషన్ డిపాజిట్‌ను రద్దుచేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.

11/01/2016 - 03:26

విజయవాడ, అక్టోబర్ 31: హైదరాబాద్‌లోని ఎపి సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా క్యాబినెట్ సబ్ కమిటీని వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలో కమిటీలో సభ్యులుగా ఉండే మంత్రుల వివరాలు ప్రకటించనున్నారు.

10/30/2016 - 03:56

అమరావతి, అక్టోబర్ 29: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు స్పందించి 33వేల ఎకరాలు ఇచ్చి రైతులు చరిత్ర సృష్టిస్తే, మరో అడుగు వేసే మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు దానిని కూడా అధిగమించి ఆంధ్ర నవ నిర్మాణంలో ముందడుగు వేయడంపట్ల ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

10/30/2016 - 03:50

శ్రీకాకుళం, అక్టోబర్ 29: ఎఒబిలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతునే ఉంది. ఎప్పటికప్పుడు మావోల ప్లీనరీలపై కోవర్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పులకు తెగబడుతోందని, దీనికి నిరసనగా వచ్చే నెల 3న మావోలు ఎఒబి బంద్‌కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మావోల బంద్‌కు కేంద్ర కమిటీ నేత ప్రతాప్ పిలుపునిస్తూ శనివారం లేఖ విడుదల చేసారు.

10/30/2016 - 03:48

సీలేరు, అక్టోబర్ 29: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో మరికొందరి పేర్లను పోలీసులు నిర్ధారించారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృతి చెందగా శనివారం నాటికి 20 మంది మృత దేహాలను గుర్తించారు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. విశాఖ జిల్లా పెదబయలు మండలం వింజరి పంచాయతీ నానాబారి గ్రామానికి చెందిన పాంగి జ్యోతి, జికెవీధి మండలం గాలికొండ పంచాయతీ మెట్టగూడ గ్రామానికి చెందిన శే్వతగా గుర్తించారు.

10/30/2016 - 03:47

గుంటూరు, అక్టోబర్ 29: దేశం మొత్తంగా వివిధ రాష్ట్రాల్లోని అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో అగ్రి గోల్డ్ ఖాతాదారులు, ఏజంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అఖిలపక్ష సమావేశం శనివారం నిర్వహించారు.

10/30/2016 - 03:44

కడప, అక్టోబర్ 29: కడప జిల్లా స్థానిక సంస్థల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కొలిక్కిరాలేదు. శనివారం జిల్లా నేతలతో విజయవాడలో సమావేశమైన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయానికి రాలేదు. పోటీ చేసేందుకు నాయకులు పెద్దసంఖ్యలో క్యూ కట్టడంతో ఎంపిక నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు.

Pages