S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/30/2016 - 03:00

విజయవాడ, అక్టోబర్ 29: పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ‘పరిసరాల పరిశుభ్రత - దోమలపై దండయాత్ర’ కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు వారాలుగా చేసిన కార్యక్రమాలపై అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. డెంగ్యూ కేసులు నెలన్నర రోజుల్లోనే 1,317 నుంచి 122 వరకు తగ్గడం ప్రభుత్వ కార్యక్రమాల ఫలితమేనన్నారు.

10/30/2016 - 03:37

విజయవాడ, అక్టోబర్ 29: సంఘ విద్రోహశక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎక్కడ చెడు జరిగినా తక్షణం దాన్ని ఖండించే విధంగా ప్రజల్లో మార్పు రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలంకరణతో బాణాసంచా కాల్చి సంబరంగా దీపావళి జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు.

10/29/2016 - 06:44

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిగులు విద్యుత్‌ను సాధించిన నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కోటిన్నర కుటుంబాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రపంచంతో పోటీపడాలని ఆయన అన్నారు.

10/29/2016 - 06:43

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థరూ.3,600 కోట్ల నష్టాల నుంచి బయటకు తీసుకురావాలంటే అక్రమ రవాణాపై వేటు వేయాలని ఏపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పర్మిట్లు లేకుండా 2500 ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నారని యూనియన్ నరేతలు సిహెచ్.చంద్రశేఖర్ రెడ్డి, కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

10/29/2016 - 06:42

హైదరాబాద్, అక్టోబర్ 28: దేవాదాయ శాఖ ఆలయాల్లో వంశపారంపర్యంగా అర్చక, ఇతర సేవలు అందిస్తున్న వారి పేర్లు, సర్వీసు ఇనాం భూముల వివరాలు 10 బి అడంగల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు వెల్లడించారు.

10/29/2016 - 06:41

విజయవాడ, అక్టోబర్ 28: పేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దుల్హన్ పథకం సత్ఫలితాలిస్తోందని పేదరికంలో మగ్గుతూ వివాహాలు జరిపించుకోలేకపోతున్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు దుల్హన్ ఇప్పుడు ఆసరానిస్తోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

10/29/2016 - 06:38

కర్నూలు, అక్టోబర్ 28: కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఇకపై కేవలం భక్తుల రాకపోకలు మాత్రమే ఉండాలని, ప్రజలు నివాసం ఉండటానికి వీలులేదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీశైలం దిగువన ఉన్న సున్నిపెంటకు ప్రాధాన్యత పెరిగింది. సుమారు 30 వేల జనాభా ఉన్న సున్నిపెంటలో శ్రీశైలంవాసులు చేరితే జనాభా సుమారు 45 వేలకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

10/29/2016 - 05:21

హైదరాబాద్, అక్టోబర్ 28: అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ విద్యా తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో అంగన్‌వాడీలను కానె్వంట్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అంగన్‌వాడీల్లో చేరే విద్యార్థులకు ఉచితంగా యూనిఫారం ఇవ్వనున్నారు. అలాగే దాదాపు 7వేల అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

10/29/2016 - 05:20

విశాఖపట్నం, అక్టోబర్ 28: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌కె జీవించి ఉన్నాడా? మరణించాడా? గాయాలతో తప్పించుకున్నాడా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రజా సంఘాల నాయకులు, తమ వద్ద లేడని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు. అయితే, ఆర్‌కె మరణించాడంటూ మావోయిస్టు పార్టీ నాయకుడు ఒకరు శుక్రవారం ధ్రువీకరించాడు.

10/29/2016 - 04:09

గుంటూరు, అక్టోబర్ 28: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ తు.చ తప్పక నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం నవ్యాంధ్ర రాజధాని ప్రభుత్వ భవనాల సముదాయంతోపాటు రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుతో కలసి శంకుస్థాపన చేశారు.

Pages