S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/22/2016 - 07:47

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: చత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో గిరిజనం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇటు పోలీసులు, అటు మావోల ఆధిపత్య పోరులో అమాయక ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఉన్న ఊరును వదిలేసి వలసపోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటు పోలీసులూ వారిని పూర్తిగా నమ్మడం లేదు... అటు మావోల నమ్మకం పొందలేక మధ్యలో నలిగిపోతున్నారు.

08/22/2016 - 07:12

నందిగామ, ఆగస్టు 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై తాను హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)ను స్వీకరించిందని, మరో రెండు వారాల్లో వాదనలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమన్నారు.

08/22/2016 - 07:12

విజయవాడ, ఆగస్టు 21: వంశధార- నాగావళి నదులను వెయ్యి కోట్ల రూపాయలతో అనుసంధానం చేస్తున్నామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం సెంట్రల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు నదులు అనుసంధాన కార్యక్రమం వచ్చే సంవత్సరానికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

08/22/2016 - 07:11

కర్నూలు, ఆగస్టు 21: కృష్ణాపుష్కరాల సందర్భంగా 10వ రోజు ఆదివారం పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులతో కృష్ణానదీ తీరం కిటకిటలాడింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి శివనామం జపిస్తూ ఆనందపరవశులవుతున్నారు. శ్రీశైలం, సంగమేశ్వరంలోని పుష్కర స్నానఘాట్లలో ఆదివారం సుమారు 2.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.

08/22/2016 - 07:10

మంత్రాలయం, ఆగస్టు 21: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్తరారాధన వేడుకలు ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని శ్రీమఠం నుంచి బంగారు పల్లకిలో రథం వద్దకు తీసుకువచ్చారు. పూజల అనంతర శ్రీప్రహ్లాదరాయలను రథంపై ఆశీనులను చేశారు.

08/22/2016 - 07:09

విజయవాడ, ఆగస్టు 21: కృష్ణా పుష్కరాలపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, గొప్ప స్పూర్తినిచ్చిందని, అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వం పట్ల ఎనలేని విశ్వాసం పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుష్కరాల 10వ రోజు ఏర్పాట్లపై వివిధ ఘాట్ల ఇన్‌ఛార్జిలతో ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/22/2016 - 07:02

తిరుమల, ఆగస్టు 21: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర బాలమందిర్ ట్రస్టుకు హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ ఆదివారం కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈమేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావుకు విరాళం చెక్కును దాత అందజేశారు. ఈసందర్భంగా దాతకు శ్రీవారి తీర్థప్రసాదాలను ఇఓ అందజేశారు.

08/22/2016 - 06:56

తిరుమల, ఆగస్టు 21: ఒక దేశాధ్యక్షుడు డ్రైవర్ కోసం 10 నుంచి 12 నిమషాలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఒక ప్రముఖుడు వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టిటిడి, పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది. కాగా డ్రైవర్లకు దర్శనం చేయించడంలో నిర్లక్ష్యం వహించారంటూ అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/22/2016 - 06:25

యాత్రికులతో కిటకిటలాడుతున్న కాళేశ్వరరావు మార్కెట్ రోడ్డు

08/22/2016 - 05:15

విజయవాడ, ఆగస్టు 21: గోదావరి పుష్కరాల తొలి రోజున దుర్ఘటన జరిగింది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. మరోసారి అలాంటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అన్నీ తానై గోదావరి పుష్కరాలను దగ్గరుండి పర్యవేక్షించారు. గోదావరి పుష్కరాల అనుభవాన్ని పాఠంగా తీసుకున్న సిఎం కృష్ణా పుష్కరాలు వచ్చేసరికి ప్రచారం తగ్గించి...ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

Pages