S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/22/2016 - 05:12

విజయవాడ, ఆగస్టు 21: కృష్ణా పుష్కరాల్లో పదో రోజైన ఆదివారం సెలవుదినం కూడా కావడంతో ఇప్పటి వరకు ఏ రోజులేని విధంగా తొలిసారిగా ఇసుకవేస్తే రాలనంతగా జనం విరగబడ్డారు. బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. భక్తజనాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నానా హైరానా పడాల్సి వచ్చింది. నేడు ఒక్కరోజే రాష్టవ్య్రాప్తంగా దాదాపు 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అంచనా.

08/21/2016 - 05:13

ఇబ్రహీంపట్నం వద్దనున్న కృష్ణా, గోదావరి సంగమ ప్రదేశంలో 25 ఎకరాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియచేశారు. గతంలో ఈ ఆలయాన్ని రాజధాని అమరావతిలో నిర్మించేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ ఇప్పుడు సంగమ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడే వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

,
08/21/2016 - 05:27

విజయవాడ, ఆగస్టు 20: కృష్ణా పుష్కరాల్లో తొమ్మిదవ రోజైన శనివారం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని 170 స్నాన ఘట్టాలు భక్తజన కెరటాలతో కళకళలాడాయి. దాదాపు 17 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. గడచిన తొమ్మిది రోజులుగా పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలు మరో మూడు రోజుల్లో ముగుస్తున్నందున పవిత్ర స్నానమాచరించి కృష్ణమ్మ జలదీవెనలందుకోటానికి కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నారు.

08/21/2016 - 05:09

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: గోదావరి నది పుష్కరాల తొలి రోజు పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేసిన కమిషన్ విచారణ మళ్లీ మొదలైంది. కమిషన్ జస్టిస్ సివై సోమయాజులు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విచారణ నిర్వహించారు. ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాల నివేదికలను ప్రభుత్వ యంత్రాంగం ఎట్టకేలకు కమిషన్‌కు సమర్పించింది.

08/21/2016 - 05:08

కర్నూలు, ఆగస్టు 20: రోజురోజుకు పెరుగుతున్న భక్తులతో కర్నూలు జిల్లాలోని పుష్కరఘాట్లు కిటకిటలాడుతున్నాయి. నదిలో పుణ్యస్నానాలు చేసి తరిస్తున్న భక్తులను చూసి కృష్ణవేణి పులకిస్తోంది. కర్నూలు జిల్లాలో శనివారం కృష్ణా పుష్కర స్నానాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. అధికారుల అంచనా ప్రకారం 1.30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. వీరిలో చాలా మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.

08/21/2016 - 05:05

విజయవాడ, ఆగస్టు 20: ప్రభుత్వ పాలనా వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఆవరణలో శనివారం సాయంత్రం మంత్రివర్గ బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ నేర్చుకోవలసిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని స్పష్టం చేశారు.

08/21/2016 - 05:04

విశాఖపట్నం, ఆగస్టు 20: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నీలి ఆర్థిక ప్రణాళిక (బ్లూ ఎకానమి ఇనీషియేటివ్)లో భాగంగా ఖనిజ నిక్షేపాలు, శక్తి వనరుల కోసం సాగర మథనాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఎర్త్‌సైన్స్ విభాగం కార్యదర్శి మాధవన్ నాయర్ రాజీవన్(ఎంఎన్ రాజీవన్) వెల్లడించారు. విశాఖలో గీతం యూనివర్శిటీ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజీవన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

08/21/2016 - 05:00

తిరుపతి, ఆగస్టు 20: చంద్రన్న బీమా పథకం దేశంలోనే అతిపెద్ద బీమా పథకం అని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ వి. వరప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో శనివారం రాష్ట్రంలోని ఐదు జిల్లాల కార్మికశాఖాధికారులతో చంద్రన్నబీమా నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

08/21/2016 - 04:59

కాకినాడ, ఆగస్టు 20: దేశంలో ధన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల ఎన్నికలను దామాషా విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల విధానం కారణంగా చట్ట సభల్లోకి ధనవంతులే వెళ్ళడంతో అక్కడ సామాన్యునికి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

08/21/2016 - 04:59

పోలవరం, ఆగస్టు 20: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి 12 మోటార్లు ఆన్‌చేసి కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. శుక్రవారం వరకూ 11 మోటార్లు ఆన్‌చేసి నీటిని తరలిస్తుండగా, మరో మోటార్‌ను శనివారం ఆన్‌చేసి రోజుకు 4250 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ వరకూ 12 మోటార్ల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించేవారు.

Pages