S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/23/2016 - 04:25

కర్నూలు, ఆగస్టు 22: కృష్ణానది పుష్కరాల సందర్బంగా 11వ రోజైన సోమవారం భక్తుల రద్దీ కొనసాగింది. కర్నూలు జిల్లాలో 1.80 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనావేశారు. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు పుష్కరఘాట్లలో సుమారు 1.30 లక్షల మంది, సంగమేశ్వరంలో 30 వేల మంది, నెహ్రూనగర్, ముచ్చుమర్రి గ్రామాల్లో 20 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు లెక్కలు గట్టారు.

08/23/2016 - 04:23

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 22: ముక్త్యాలలో భారీ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తానికి శాశ్వతంగా సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో పుష్కర ఘాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

08/23/2016 - 04:20

విజయవాడ , ఆగస్టు 22: స్వాతంత్య్ర భారతవనిలో దేశం కోసం త్యాగం చేసినవారిని స్మరించుకోవాల్సిన బాధ్యత వుందని అందరిపైనా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ది న్యూ వెన్యూలో సోమవారం సాయంత్రం జరిగిన ‘స్వాతంత్య్ర సప్తతః సాయం సంధ్య’ కవుల, కళాకారుల, రచియితలు, గాయకుల ఇష్టాగోష్టి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

08/23/2016 - 04:18

నంద్యాల, ఆగస్టు 22: పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు రూ.66 వేలు లంచం అడిగిన కర్నూలు జిల్లా నంద్యాల సర్వశిక్ష అభియాన్ టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌ను ఎసిబి అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తేదారు వెంకటచిన్నారెడ్డి సర్వశిక్ష అభియాన్ కింద రూ.31 లక్షల పనులు పూర్తిచేశాడు.

08/23/2016 - 04:18

విజయవాడ, ఆగస్టు 22:్ఫరం పాండ్స్ తవ్వకంలో దేశంలో మన రాష్టమ్రే ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ‘నీరు- ప్రగతి’పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట సంజీవని కింద ఇప్పటివరకు 58 వేల పంట కుంటల తవ్వకం పూర్తి అయ్యిందంటూ దీనిని లాజికల్‌గా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నీరు- మీరు పంట సంజీవని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సిమెంటు రోడ్లు నిర్మాణం.

08/23/2016 - 04:17

భీమవరం, ఆగస్టు 22: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలంలో సోమవారం నిర్వహించిన తిరంగాయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రధాని పిలుపుమేరకు నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గమంతటా కొద్ది రోజులుగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మొగల్తూరు మండలంలో తిరంగా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లుచేశారు.

08/23/2016 - 04:16

విడవలూరు, ఆగస్టు 22: నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని రామతీర్థం సమీపంలో సముద్రంలో జాలర్లకు సీతమ్మవారి పంచలోహ విగ్రహం దొరికినట్లు తెలియవచ్చింది. మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తుండగా వారికి వలలో లభించినట్లు తెలిసింది. ఆ విగ్రహం సముద్ర తీరంలోకి కొట్టుకొని రావడంతో వరిణి, దండిగుంట గ్రామాలకు చెందినవారు ఆ విగ్రహాన్ని తమతో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

08/23/2016 - 04:16

విజయనగరం(్ఫర్టు), ఆగస్టు 22: ప్రముఖ సైకాలజిస్ట్, ఎయు విద్యావిభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. మనోవైజ్ఞానిక రంగానికి చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా 2016 సంవత్సరానికి న్యూఢిల్లీకి చెందిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్(ఇన్‌స్పా) పికె సుబ్బరాజ్ మెమోరియల్-టెస్ట్ పెర్మార్మన్స్ పురస్కారానికి ఎంపిక చేసింది.

08/23/2016 - 04:15

చంద్రగిరి, ఆగస్టు 22: చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని మల్లవరం బస్టాప్ వద్ద నిలిచి ఉన్న లారీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారును ఢీకొనడంతో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఇన్నోవా డ్రైవర్ తప్పిదంతో లారీని వేగంగా ఢీకొనడంతో వాహనం ఎడమవైపు పూర్తిగా చిద్రమైంది.

08/23/2016 - 04:15

విశాఖపట్నం, ఆగస్టు 22: నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండలు ఇలానే కొనసాగుతాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఉత్తర కోస్తాలో సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి.

Pages