S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/23/2016 - 12:00

విజయవాడ: ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సింధు, గోపీచంద్, ఆమె తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు.

08/23/2016 - 11:40

విజయవాడ: రైల్వే మంత్రి సురేష్ ప్రభు నేడు విజయవాడకు రానున్నారు. నంద్యాల- యర్రగుంట్ల రైల్వే లైన్ జాతికి అంకితం ఇస్తారు. నంద్యాల- కడప మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలును మంత్రి ప్రారంభిస్తారు.

08/23/2016 - 11:37

విశాఖ: బంగాళాఖాంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, ఆకాశంలో మేఘాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దక్షిణ కోస్తాలో సాధారణకంటే 3 నుంచి 5, రాయలసీమలో 3 నుంచి 4, ఉత్తర కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కబోతతో కోస్తా జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

08/23/2016 - 04:42

విజయవాడ, ఆగస్టు 22: ప్రస్తుత కృష్ణా పుష్కరాల్లో సిఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ముందెన్నడూ లేని విధంగానే కాకుండా నభూతో నభవిష్యత్‌లా విశాలమైన స్నాన ఘట్టాలతో ఎంతో పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలను ఓ గుణపాఠంగా మలచుకున్నారు.

08/23/2016 - 04:39

విజయవాడ, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే దాదాపు మూడు కోట్ల మంది పుష్కర యాత్రికులు తరలి రాగలరనే ప్రచారం, దానికితోడు జాతీయ రహదారులు, ఇతర వాహనాల ట్రాఫిక్ మళ్లింపు, ఇతరత్రా ఆంక్షలు వీటి నేపథ్యంలో నగర వాసులు హడలెత్తిపోయారు. పుష్కరాల సందర్భంగా ప్రతి ఇంట సహజంగానే బంధుమిత్రుల తాకిడి ఉండనే ఉంటుది.

08/23/2016 - 04:39

హైదరాబాద్, ఆగస్టు 22: ఆంగ్లభాషలో మరింత ప్రావీణ్యం సాధించదలచుకున్న ఉపాధ్యాయులకు కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఆధీనంలోని కేంబ్రిడ్జి ఇంగ్లీషు లాంగ్వేజి అసెస్‌మెంట్ సంస్థ వెబినార్‌ను ప్రారంభించింది. ఇందుకు వార్షిక షెడ్యూలును కూడా ప్రకటించింది.

08/23/2016 - 04:38

న్యూఢిల్లీ, ఆగస్టు 22:కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కాంపా నిధుల కింద రూ.44 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే అధ్యక్షతన కాంపా నిధులపై వివిధ రాష్ట్రాల అటవీ మంత్రులతో ఢిల్లీలో జరిగిన సమావేశానికి మంత్రి బొజ్జల హాజరయ్యారు.

08/23/2016 - 04:37

విజయవాడ, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాల సందడిలో తలమునకలై వున్న పోలీస్‌శాఖ చివరకు కేంద్రంలో కీలకమైన సీనియర్ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును సైతం విస్మరించింది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ సకాలంలో ఎస్కార్ట్ వాహనం గన్నవరం విమానాశ్రయంకు వెళ్లకపోవటంతో ఆయన తన సొంత గన్‌మెన్‌లు, వ్యక్తిగత కార్యదర్శులతో సింపుల్‌గా నగరానికి చేరుకోటం పలువురిని ఆశ్చర్యపరచింది.

08/23/2016 - 04:36

హైదరాబాద్, ఆగస్టు 22: సమాచారాన్ని అందించడంలో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పట్టణాభివద్ధి, ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ మీడియా సంస్ధలు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో గురుతర బాధ్యతను కలిగి ఉన్నాయని అన్నారు. సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను సందర్శించారు.

,
08/23/2016 - 04:29

కాకినాడ/ఏలూరు, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదం గోదావరి జిల్లాల్లో పెనువిషాదం నింపింది. హైదరాబాద్ నుండి కాకినాడ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యిందనే సమాచారం మీడియాద్వారా తెలుసుకున్న గోదావరి జిల్లావాసులు తమ తమ వారి కోసం ఆదుర్దాకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు జిల్లాలకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Pages