S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/23/2016 - 04:14

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి..గత పదేళ్ల కాలంలో ఖరీఫ్‌లో ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదురుకాలేదు.. గత 26 రోజుల్లో ఒక్క వర్షం కురిసిన రోజు కూడా నమోదు కాలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఒక్క దుక్కు వర్షం కురిస్తే చాలు పైర్లు గట్టెక్కినట్టేనని రైతులు ఎదురుచూస్తున్నారు.

08/22/2016 - 17:59

విజయవాడ: రియో ఒలంపిక్స్‌లో రోజుకు 50వేల మందికి ఆహారం అందించారని, అయితే విజయవాడ బస్టాండ్ పుష్కరనగర్ దగ్గర ఆదివారం ఒక్కరోజే 2 లక్షల మందికి అన్నదానం చేశామని, ఇది ప్రపంచ రికార్డని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుష్కరాల్లో రోజుకు లక్షన్నరమందికి అన్నదానం చేశామని చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో అన్నదానం, పరిశుభ్రత వివరాలను గిన్నిస్ బుక్‌కు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

08/22/2016 - 16:15

కర్నూలు : మిగిలిన రాష్ర్టాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూత ఇవ్వాలని, అప్పటివరకు రాజీ పడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీశైలంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎవరో ఒకరిద్దరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా, పుష్కర ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారని అన్నారు.

08/22/2016 - 13:41

విజయవాడ: ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో రేపు సన్మానం జరగనుంది. ఉ.10 గంటలకు గన్నవరం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు కృష్ణా పుష్కరాల హారతి కార్యక్రమంలో సింధు పాల్గొంటుంది.

08/22/2016 - 13:22

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం శ్రీశైలం పర్యటనకు బయలుదేరారు. శ్రీశైలం లింగాలఘాట్‌ను సీఎం పరిశీలించి, భక్తులను అడిగి కలుసుకోనున్నారు. శ్రీశైలంలోని ఘాట్లన్నీ పుష్కర యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి.

08/22/2016 - 11:58

ఏలూరు: ఏలూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్నలారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

08/22/2016 - 11:55

తిరుపతి: తిరుపతి మండలం గాంధీపురం వద్ద సోమవారం ఉదయం అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మదనపల్లెకి చెందిన నాగరాజు, భారతి, కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. కృష్ణా పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది.

08/22/2016 - 11:51

విజయవాడ: పుష్కరాలలో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఏఎన్‌.ప్రసాద్‌‌ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్‌‌ మృతి చెందాడు.

08/22/2016 - 07:51

విజయవాడ, ఆగస్టు 21: సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకుని కృష్ణా పుష్కరాలను ప్రశంసనీయంగా నిర్వహించగలిగామని, అదే స్ఫూర్తితో ‘రియల్ టైమ్స్ గవర్నెన్స్’ టెక్నాలజీ ద్వారా రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

08/22/2016 - 07:50

కాకినాడ, ఆగస్టు 21: సక్రమమైన, ప్రణాళికాయుతమైన పశు పోషణ ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, పశుపోషణలో అగ్రభాగాన ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కొంతకాలంగా పశు సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల నుండి జిల్లాను గట్టెక్కించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

Pages