S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/24/2016 - 05:23

హైదరాబాద్, ఆగస్టు 23: కృష్ణా పుష్కరాలు మంగళవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. అన్ని పుష్కర ఘాట్లలో నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. చివరిరోజు అన్ని ఘాట్లకు జనం తాకిడి కనిపించింది. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి, పక్కాప్రణాళికతో విజయవంతంగా ముగించింది. 12న ప్రారంభమైన ఆదిపుష్కరాలు మంగళవారం ముగిశాయి.

08/24/2016 - 04:33

హైదరాబాద్, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై దాపరికం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. స్విస్ ఛాలెంజ్ విధానం ఎవరికోసం.. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఇంత దాపరికం ఎందుకు’ అని నిలదీసింది.

08/23/2016 - 18:45

విజయవాడ: పసిడి పతకం చేజారడం బాధగా ఉన్నా, ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న నా కల సాకారమైందని పీ.వీ.సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం చూపిన ఆదరణ మరువలేనిదని అన్నారు. ఎయిర్‌పోర్టు, స్టేడియం దగ్గర ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యం కలిగిందని ఆమె తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే పతకం వచ్చిందని అన్నారు. కోచ్‌ గోపీచంద్‌ సహకారంతోనే ఈస్థాయికి వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

08/23/2016 - 17:03

విజయవాడ : ఏపీ కొత్త రాజధానితో రాయలసీమను అనుసంధానం చేశామని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రులు సురేష్‌ప్రభు, వెంకయ్యనాయుడు అన్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గాన్ని రిమూట్‌ ద్వారా మంగళవారం కేంద్రమంత్రులు సురేష్‌ప్రభు, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.

08/23/2016 - 16:58

విజయవాడ: ఏపీలో పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లు బాగున్నాయని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సీఎం చంద్రబాబును మంగళవారం అభినందించారు. పవిత్ర సంగమం వద్ద పుష్కర హారతికి రావాలని ఆయనను సీఎం ఆహ్వానించారు.

08/23/2016 - 14:49

విజయవాడ : అమరావతి స్పోర్ట్స్‌ సిటీలో కోచ్ గోపీచంద్‌ అకాడమీకి 15 ఎకరాలు కేటాయిస్తాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన సింధుకు మంగళవారం విజయవాడలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే మనకు గుర్తింపు రాదని అన్నారు.

08/23/2016 - 14:38

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో భారతీయులకు పీవీ సింధు ఆశాకిరణంలా కనిపించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నిర్వహించిన సింధు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. సింధును తీర్చిదిద్దడంలో కోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రులు రమణ, విజయల ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. సింధును శాలువా, పుష్పగుచ్ఛాలతో చంద్రబాబు సత్కరించారు.

08/23/2016 - 13:55

విజయవాడ: పుష్కరాల చివరి రోజు మంగళవారం విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా కారు (ఏపీ 30పీ 4789) డివైడర్‌ను ఢీకొట్టింది. పుష్కర స్నానం చేసి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

08/23/2016 - 13:43

విజయవాడ: తన తాతగారి వూరైన విజయవాడలోని ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడానని సింధు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సింధుకు సన్మానం జరుగుతున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజల ప్రేమ, అభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు సింధు అన్నారు.

08/23/2016 - 13:40

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధుతో మంగళవారం బ్యాడ్మింటన్‌ ఆడారు. విజయవాడలో సింధుకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ వేదికపై సింధుతో పోటాపోటీగా చంద్రబాబు ఆడుతున్న సమయంలో స్టేడియం చప్పట్లతో మార్మోగింది.

Pages