S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/06/2016 - 18:00

ఒంగోలు: ఆస్తికోసం కన్నకూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రి కిరాతకం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గత నెల 3న కటకం దుర్గా భవానీ (15) మరణించింది. ప్రేమ విఫలమై భవానీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించాడు.

04/06/2016 - 18:00

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు బుధవారం ఇక్కడ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) అధికారులతో సమావేశమయ్యారు. రాజధానిలో చేపట్టే రోడ్లు, వంతెనలు, ఫ్లయ్ ఓవర్ల నిర్మాణాలకు ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. తొలివిడతగా 250 కోట్లతో 18కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు.

04/06/2016 - 17:59

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలు ఆమెకు బాధకలిగిస్తే వాటిని ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధమేనని వైకాపా ఎమ్మెల్యే రోజా బుధవారం ఎపి అసెంబ్లీలో హక్కుల కమిటీ ముందు చెప్పారు. తనపై టిడిపి ఎమ్మెల్యేలు కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, వాటిపై హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

04/06/2016 - 17:58

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే అనిత (పాయకరావుపేట)పై అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే రోజా బుధవారం ఎపి అసెంబ్లీలో హక్కుల కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో సభ్యులు సుమారు గంటసేపు రోజాను విచారించారు. ఈ వివరణను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్పీకర్‌కు హక్కుల కమిటీ ఓ నివేదిక అందజేస్తుంది.

04/06/2016 - 16:22

హైదరాబాద్: ఎపి అసెంబ్లీకి చెందిన హక్కుల కమిటీ బుధవారం భేటీ అయింది. టిడిపి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు బహిష్కరణకు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజా కమిటీ ఎదుట హాజరయ్యారు.

04/06/2016 - 16:22

విశాఖ: ఎపి మంత్రివర్గంలో టిడిపి యువనేత నారా లోకేష్ చేరితే మంచిదేనని, అందుకు అన్ని అర్హతలు ఆయనకున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ సలహాలు పార్టీకే కాదు, ప్రభుత్వానికీ అవసరమన్నారు.

04/06/2016 - 16:22

నెల్లూరు: రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం ఏమీ చేయలేకపోయానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే తాను ఉగాది రోజున టిడిపిలో చేరుతున్నానని గూడూరు వైకాపా ఎమ్మెల్యే సునీల్ బుధవారం తెలిపారు. టిడిపిలో చేరాక త్వరలోనే బహిరంగ సభ నిర్వహించి తన మనోభావాలను ప్రజలకు వివరిస్తానన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రగతి పనులకు పదికోట్ల రూపాయలు కేటాయిస్తానని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

04/06/2016 - 14:11

విజయనగరం: ఇక్కడ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.చిన్నోడుకు చెందిన ఇళ్లలో శ్రీకాకుళంకు చెందిన ఎసిబి అధికారులు బుధవారం సోదాలు జరుపుతున్నారు. విశాఖ, విజయనగరంలో దాడులు చేసి చిన్నోడుకి భారీ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. ఇప్పటివరకూ 3 లక్షల నగదు, 40 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎసిబి డిఎస్పీ రంగరాజు తెలిపారు.

04/06/2016 - 14:10

శ్రీకాకుళం: విధి నిర్వహణలో భాగంగా ఇసుక రేవు వద్ద ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ వడదెబ్బకు గురై మరణించిన దుర్ఘటన నరసన్నపేట మండలంలో బుధవారం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్)లో ఎఇగా పనిచేస్తున్న నాగభూషణరావు మడపాం వద్ద వంశధార నదీ తీరంలో ఇసుక రేవు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఎండదెబ్బకు తట్టుకోలేక ఉన్నచోటనే ఆయన కుప్పకూలి మరణించినట్లు మిగతా సిబ్బంది తెలిపారు.

04/06/2016 - 12:20

విశాఖ: విశాఖ మన్యంలోని ముంచింగుపుట్టు మండలం దూలిపట్లు వద్ద బుధవారం ఉదయం మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్ జవానుతో పాటు స్థానిక వ్యక్తి ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం మావోలు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సమాచారం.

Pages