S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/08/2016 - 12:21

చింతూరు, ఏప్రిల్ 7: చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లిలో ఇటీవల కిడ్నాప్‌చేసిన యువకుడిని మావోయిస్టులు హతమార్చారు. గ్రామానికి చెందిన చెన్నూరి శంకర్ (22)ను మావోయిస్టులు గత కొన్ని రోజుల క్రితం కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఎటపాక మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శంకర్‌ను హతమార్చి, మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లారు.

04/08/2016 - 12:20

విజయవాడ, ఏప్రిల్ 7: దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారికి ఈ అవార్డులను ప్రటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డులు పొందిన వారి వివరాలను రాష్ట్ర భాషా సంఘం గురువారం విడుదల చేసింది. 23 మంది కళారత్న పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. వీరిలో ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున నగదు బహుమతిని, హంస ప్రతిమను అందచేసి సత్కరిస్తారు.

04/07/2016 - 18:00

దిల్లీ: అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సస్పెన్షన్‌ను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాల్సిందిగా ఎపి ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా తనను సస్పెండ్ చేశారని రోజా సుప్రీంకు నివేదించారు.

04/07/2016 - 17:59

విజయవాడ: ప్రస్తుత వేసవిలో వడగాలుల ధాటికి ఇప్పటివరకూ ఎపిలో 45 మంది మరణించారని, కడప జిల్లాలో అత్యధిక సంఖ్యలో 16 మంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రి ఎన్.చినరాజప్ప గురువారం తెలిపారు. ఎండదెబ్బ బారిన పడకుండా ప్రజలకు వైద్యులు తగు సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దాతలు విరివిగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

04/07/2016 - 15:27

విజయవాడ: టిడిపి యువనేత నారా లోకేష్‌ను ఎపి మంత్రివర్గంలోకి తీసుకుంటే అన్ని విధాలా మంచిదేనని సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. రికార్డు స్థాయిలో కార్యకర్తలను చేర్పించి టిడిపి బలోపేతానికి కృషి చేసిన లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన సేవలు ప్రభుత్వానికీ అందుబాటులోకి వస్తాయన్నారు.

04/07/2016 - 15:26

విజయవాడ: విద్యుత్‌ను పొదుపు చేయడంలో దేశం మొత్తమీద ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ బోర్డు చైర్మన్ రాజీవ్‌శర్మ అన్నారు. ఇక్కడ గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో ఎపి అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

04/07/2016 - 15:25

విజయవాడ: విద్యుత్ రంగంలో దేశంలోనే తొలిసారిగా సంస్కరణలు ప్రవేశపెట్టి వినూత్న ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగుతోందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో గురువారం అంతర్జాతీయ ఇంధన సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ ఎల్‌ఇడి బల్బులను ఇవ్వడం ద్వారా విద్యుత్‌ను బాగా ఆదా చేస్తున్నామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసే ఫ్యాన్లు, వ్యవసాయ మోటార్లను ఆయన ప్రారంభించారు.

04/07/2016 - 12:51

చిత్తూరు: చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఉదయం నాటు బాంబు పేలడంతో అంతా ఒక్కసారి భయాందోళనలకు గురయ్యారు. న్యాయమూర్తులు, లాయర్లు, కోర్టుకు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు.

04/07/2016 - 12:48

రాజమండ్రి: చింతూరు మండలం పిడుగురాళ్లపల్లిలో శంకర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు, మావోయిస్టులే ఇతడిని కిడ్నాప్ చేసినట్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ సంఘటనపై అనుమానాలు రావడంతో ఇది మావోయిస్టుల పనా? లేక ఇంకెవరైనా శంకర్‌ను పట్టుకుపోయారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

04/07/2016 - 12:48

హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ చేపట్టబోయే రథయాత్రకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రథయాత్రకు అనుమతించరాదని పోలీసులు చెబుతున్న అభ్యంతరాలను న్యాయస్థానం అంగీకరించింది. దీంతో డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని మందకృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Pages