S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/06/2016 - 12:18

కాకినాడ: కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అప్రజాస్వామిక విధానాలకు స్వస్తి పలకాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపి కేవీపీ రామచంద్రరావు అన్నారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు మానవహారం నిర్మించిన సందర్భంగా వారు మాట్లాడారు. అరుణాచల్ ప్రదేవ్, ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాలను కూల్చివేసి రాష్టప్రతి పాలన విధించడం అన్యాయమన్నారు.

04/06/2016 - 12:18

కడప: భర్త రెండోపెళ్లికి సిద్ధపడగా అతని ఇంటిముందు మొదటి భార్య ఆందోళన ప్రారంభించిన సంఘటన ప్రొద్దుటూరులో బుధవారం జరిగింది. పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమర్‌నాథ్ రెండో పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుని భార్యను బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దీంతో అతని ఇంటిముందు భార్య ఆందోళన చేపట్టింది.

04/06/2016 - 12:17

విశాఖ: ఎపిలో ఎవరి సహకారం లేకుండానే తమ పార్టీ బలం పుంజుకుంటోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన బిజెపి జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర సర్కారు అమలుచేస్తోందని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

04/06/2016 - 08:47

నాగార్జునసాగర్, ఏప్రిల్ 5: నాగార్జునసాగర్ ప్రాజెక్టును మంగళవారం మాజీ చీఫ్ ఇంజనీర్ బషీర్ ఆధ్వర్యంలో జపాన్ దేశానికి చెందిన ఇంజనీర్ల బృందం సందర్శించి పరిశీలించింది. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ డ్యాం అంతర్భాగంలో ఉన్న గ్యాలరీలను వారు పరిశీలించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియం, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని వారు సందర్శించారు. బుధవారం ఈ బృందం కుడికాలువను పరిశీలించనున్నారు.

04/06/2016 - 08:46

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఏపి అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వివాదానికి 3తెర2 పడుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. బుధవారం (6న) అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుకు రోజా హాజరుకానున్నారు. గతంలో ఆమె రెండు పర్యాయాలు కమిటీ ముందుకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

04/06/2016 - 08:25

విశాఖపట్నం, ఏప్రిల్ 5: తెలుగు రాష్ట్రంలో తెలుగుభాష పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోందని, తెలుగుభాషకు తగిన గౌరవం దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర హిందీ విభాగం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

04/06/2016 - 08:24

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగం జరగనుంది.

04/06/2016 - 08:23

శ్రీకాకుళం, ఏప్రిల్ 5: పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సమూలంగా మార్చివేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విభజన అనంతరం హోంశాఖలో ఏర్పడిన ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు.

04/06/2016 - 08:22

కాకినాడ, ఏప్రిల్ 5: తూర్పు గోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ తీర ప్రాంతానికి పర్యాటక ప్రాముఖ్యతను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. ఈ కారణంగానే ఈ ఏడాది నుండి మురమళ్ళ కేంద్రంగా రాష్టస్థ్రాయిలో కోనసీమ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

04/06/2016 - 08:22

విజయవాడ, ఏప్రిల్ 5: కేంద్ర పర్యావరణ పరిరక్షణ శాఖ నుంచి సరైన అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణపు పనులను వేగవంతం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలను సైతం పక్కదారి పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఎ పరిధిని, స్థానిక సంస్థల అధికారాలను హరింప చేసేందుకు ఎంతో రహస్యంగా పన్నాగాలు పన్నుతున్నారని పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ఆరో పించారు.

Pages