S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/16/2019 - 05:05

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 15: ఇసుకను ప్యాకేజీల్లో అమ్మరని ఎవరైనా పవన్‌కళ్యాణ్‌కు చెప్పండంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. అమరావతిలో పవన్‌కళ్యాణ్ ఇల్లు కట్టుకున్న సమయంలో అప్పట్లో ఇసుకను ఎవరో ఫ్రీగా ఇచ్చారని ఆదివారం ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఇసుక విధానంపై ఏదైనా మాట్లాడాలంటే అలా కుప్పల దగ్గరకు వెళ్లి నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం లేదన్నారు.

09/16/2019 - 05:04

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద కౌలు రైతులను గుర్తించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కౌలు రైతులకు కిసాన్ సమ్మాన్‌ను కేంద్రం వర్తింపజేయక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. కేంద్రం అందించే 6వేల రూపాయలను కలుపుకుని ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేయనుంది.

09/16/2019 - 05:04

శ్రీశైలం సెప్టెంబర్ 15: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో గోఆర్క్ తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు గోఆర్క్ తయారీకి ఆదివారం శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈఓ కెఎస్.రామారావు పూజలు చేసి గోశాలతో గోఆర్క్ తయారీని ప్రారంభించారు. త్వరలో పెద్దమొత్తంలో గోఆర్క్ తయారుచేసి భక్తులకు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు.

09/16/2019 - 05:01

కడప, సెప్టెంబర్ 15: పిల్లలు ఏడ్చేలా తొడపాశంపెట్టి ఆపై బుజ్జగించిన చందంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. కడప నగరంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు.

09/16/2019 - 04:23

విజయవాడ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లకు గౌరవ వేతనాన్ని ఆగస్టు నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వీరు 88,296 మంది ఉన్నారు. వీరికి గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3వేల రూపాయలకు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఆ మేరకు చెల్లింపులు చేయలేదు.

09/16/2019 - 04:22

విజయవాడ, సెప్టెంబర్ 15: దేశంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ‘ఒకే దేశం - ఒకే భాష’ నినాదంతో మరో కుట్రకు నరేంద్ర మోదీ, అమిత్ షా తెరతీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. దేశానికి ఒకే భాష ఉండాలి, అది హిందీ అయి ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు.

09/16/2019 - 04:21

అమరావతి, సెప్టెంబర్ 15: విద్యుత్ రంగాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక పురోగమన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ రంగాన్ని మరింత సమర్థంగా, ఆర్థిక సుస్థిరత సాధించేలా చేయటంతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

09/16/2019 - 04:19

గుంటూరు, సెప్టెంబర్ 15: పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్లను రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం వారి నోటికాడి కూడు తీసేసిందని, క్యాంటీన్లు మూసివేయాలనుకున్న ప్రభుత్వం వాటికి ఉన్న రంగులు తొలగించి సున్నం ఎందుకు పూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/16/2019 - 04:02

గుంటూరు, సెప్టెంబర్ 15: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను వల్లె వేయకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/16/2019 - 04:00

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 15: గోదావరిలో పడవ బోల్తాపడి పర్యాటకుల మృతి చెందడం హృదయ విదారకమైన ఘటన అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పడవ ప్రమాద ఘటన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురైయినట్లు ఆదివారం తెలిపారు. విహార యాత్ర విషాద యాత్రగా మారడం దురదృష్టకమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.

Pages