S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2017 - 01:22

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రాకు కరవు సహాయక చర్యలకోసం జాతీయ విపత్తు నిధి నుంచి రూ.518 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి ఎస్.ఆహ్లువాలియా తెలిపారు. ఆంధ్రాలో నెలకొన్న కరువు సహాయ చర్యలకోసం రూ.3173 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో వైఎస్సాఆర్‌సిపి ఎంపి విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ఆంధ్రాకు కేంద్రం కరవు సహాయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

07/22/2017 - 01:21

విజయవాడ, జూలై 21: విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఇక మార్గం సుగమమైనట్లే. విమానాశ్రయ పరిధిలో భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

07/22/2017 - 01:21

విజయవాడ (క్రైం), జూలై 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో చర్చల సారాంశాన్ని గవర్నర్ వెల్లడించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

07/22/2017 - 01:19

అమరావతి, జూలై 21: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి గ్రామంలో దళితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో విలేఖరులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

07/22/2017 - 01:18

విజయవాడ, జూలై 21: విపత్తుల నిర్వహణపై నిపుణులైన శాస్తవ్రేత్తల పరిశోధనలను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంవి శేషగిరిబాబు పేర్కొన్నారు.

07/22/2017 - 01:18

విజయవాడ, జూలై 21: గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ ఆర్ రెడ్డప్పరెడ్డి పదవీకాలం ఈ ఏడాది మే 27తో ముగిసింది. దీంతో ఏర్పడ్డ ఖాళీల్లో పి రామసుబ్బారెడ్డి, ఎన్‌ఎండి ఫరూఖ్‌లను నామినేట్ చేశారు.

07/22/2017 - 01:18

భీమవరం, జూలై 21: ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ల్యాబ్‌లను నెలకొల్పుతోంది. రొయ్యలు, చేపల సాగులో కీలకమైన నీరు, మట్టి, వైరస్ పరీక్షలకు ఈ ల్యాబ్‌లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో మొత్తం 22 ల్యాబ్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నెలకొల్పనున్నారు.

07/22/2017 - 00:50

రాజమహేంద్రవరం, జూలై 21: వరద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. ఉపనది శబరికి వరద తాకడంతో నురగలతో వడిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద శుక్రవారం సాయంత్రానికి నిలకడగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కాస్తంత తగ్గుముఖం పట్టినా దిగువ ప్రాంతానికి వేగంగా నీటి మట్టం పెరుగుతూ ఉరకలేస్తోంది.

07/22/2017 - 00:49

మడకశిర, జూలై 21: దేశ రాష్టప్రతిగా ఎన్నికైన కోవింద్ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై నమ్మకం కలిగే విధంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ భారత రాష్టప్రతి స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఓటు వేసిందన్నారు.

07/22/2017 - 00:49

కుప్పం, జూలై 21: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల కుప్పంలో పర్యటనలో భాగంగా శుక్రవారం లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. కుప్పంలోని సర్కిల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించారు.

Pages