S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/02/2019 - 04:26

విజయవాడ, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గ దేవస్థానం పండితులు ఆశీర్వదించారు.

01/02/2019 - 04:26

విజయవాడ, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ గడిచిన నాలుగేళ్లలో ప్రాధాన్యత ఇచ్చింది. అనేక కొత్త రైళ్ల ప్రారంభం, అదనంగా హాల్ట్‌లు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఏపీ ప్రజలకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

01/02/2019 - 03:57

విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న దృష్టిలోపం గల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్ మంగళవారం మెమో నెం 14/103/2017 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వీరికి మానవీయ కోణంలో పాత పద్దతిలోనే హాజరును అమలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

01/02/2019 - 03:56

కోటవుటర్ల, జనవరి 1: చలి తీవ్రతకు తాళలేక విశాఖ జిల్లా కోటవురట్ల మండలంలో సోమవారం రాత్రి ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. కోటవురట్ల రజకవీధికి చెందిన టేకు అచ్చన్న(65), చినలింగాపురం జంక్షన్‌లో కల్లూరి రామయ్యమ్మ(70), రాట్నాలపాలెంలో వారా రాములమ్మ(68) మృతి చెందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

01/02/2019 - 03:55

విజయవాడ, జనవరి 1: నూతన సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. వైద్య చికిత్సల సాయం కోసం దరఖాస్తులు 7386 వచ్చాయి. వీటిలో రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న కేసులు 6207. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకూ రీయింబర్స్ చేసిన సొమ్ము 34.5 కోట్ల రూపాయలు. ఎల్వోసీలకు 1179 దరఖాస్తులు రాగా, 19.13 కోట్ల రూపాయలు విడుదల చేశారు.

01/02/2019 - 03:54

విజయవాడ, జనవరి 1: అభివృద్ధిలో నవ్యాంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతూ మెరుగైన పాలనను పారదర్శకతతో అందిస్తున్న నారా చంద్రబాబునాయుడి సేవలు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో కూడా అందించాలని కోరుతూ ఏపీఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీ అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

01/02/2019 - 03:53

వజ్రపుకొత్తూరు, జనవరి 1: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ ఆశయ సాధనకు కృషి చేద్దామని వైసీపీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఒంకులూరు సమీపంలో రాత్రి బస చేసిన వేదిక వద్ద 2019 నూతన సంవత్సర వేడుకలను అభిమానులు, కార్యకర్తల మధ్య నిర్వహించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర పొడవుప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివి అన్నారు.

01/02/2019 - 04:00

విజయవాడ, జనవరి 1: పాకిస్థాన్ చేతుల్లో బందీలుగా ఉన్న శ్రీకాకుళం మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు.

01/02/2019 - 04:02

అమరావతి, జనవరి 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్నభూమి- మావూరు కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

01/02/2019 - 04:01

విజయవాడ, జనవరి 1: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు కల్పించాల్సిన రాయితీల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రశక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని, అయితే ఉద్యోగులంతా మరింత బాధ్యతగా పనిచేస్తూ స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పాటు అందించాలని కోరారు.

Pages