S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/16/2018 - 03:59

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని, విభజన సమయంలో కేంద్రంలోని పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా ఇబ్బంది పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయని, అయినా పట్టుదలతో, కసిగా పని చేసి అధిగమిస్తున్నామని వ్యాఖ్యానించారు.

10/16/2018 - 03:57

విజయవాడ, అక్టోబర్ 15: నిన్న హుదూద్.. నేడు తిత్లీ.. రెండు తుపానులు కోస్తాంధ్రపై విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపచేశాయి. సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నీ తానై తుపాను కదలికలను గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, తుపాను సహాయక చర్యలనూ పర్యవేక్షించారు.

10/16/2018 - 03:56

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేరుతో నకిలీ ఉద్యోగ సిఫారసు లేఖను ఒక వ్యక్తి సృష్టించాడు. ఈ లేఖ సృష్టించింది పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత కారు డ్రైవరు కావడం గమనార్హం. విద్యుత్ శాఖలో షిప్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి పేరుతో ఒక సిఫారసు లేఖను ఈమెయిల్ ద్వారా ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావుకు పంపారు.

10/16/2018 - 03:55

విజయవాడ, అక్టోబర్ 15: మాజీ మంత్రి మాల్యాల రాజయ్య ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన ప్రజా సేవకు అంకితమయ్యారని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం ఆవేదన కల్గించిందని తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని నివాళులు అర్పించారు.

10/16/2018 - 03:54

విజయవాడ, అక్టోబర్ 15: పట్టణ ప్రజలపై భారాలు పెంచి, మున్సిపల్ కార్మికుల ఉపాధికి ముప్పు తెచ్చే జీఓ నెం 279 రద్దు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వ ఏ మాత్రం స్పందించకపోవడంతో వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

10/16/2018 - 03:54

విజయవాడ, అక్టోబర్ 15: అమరావతిలో ఆధునిక మిలిటరీ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర సబ్ ఏరియా కమాండ్ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠాతో ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు సోమవారం సమావేశమయ్యారు. మిలిటరీ స్టేషన్ ఏర్పాటు, ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, మాజీ సైనికోద్యోగుల సమస్యలపై చర్చించారు.

10/16/2018 - 03:53

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి ముందుచూపు, నష్ట నివారణకు చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా సహాయ, పునరావాస చర్యలు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై విచారం వ్య క్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను ముఖ్యమంత్రికి సోమవారం రాశారు.

10/16/2018 - 04:42

విజయవాడ: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు ఎక్కువ అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్రత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 27 కేసులు నమోదు అవడం ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితిని గమనించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులను, మాస్కులను, ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా సోమవారం టెలీ కాన్పరెన్సు నిర్వహించారు.

10/16/2018 - 03:52

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 15: తుపాను ప్రభావిత ప్రాంతాలలో బాధితుల గోడు హృదయ విదారకంగా ఉందని, భవిష్యత్తుపై బెంగపడుతున్న బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడమే కాకుండా మారుమూల గ్రామాలకు సైతం సహాయచర్యలను విస్తరింపచేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు.

10/16/2018 - 03:51

విజయవాడ, అక్టోబర్ 15: మన దేశంలో ప్రాచీన కాలం నుంచి వ్యవసాయంలో మహిళలే కీలకపాత్ర పోషిస్తున్నారని అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల వారిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని ఒక కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళా రైతు దినోత్సవం - 2018 కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Pages