S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/01/2018 - 02:07

విజయవాడ, సెప్టెంబర్ 30: నాలుగేళ్లుగా పక్కన పెట్టిన నిరుద్యోగ భృతి అంశం 6నెలల్లో ఎన్నికలు రానుండగా చంద్రబాబుకు గుర్తొచ్చిందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. దీనిపై విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని, ఇది కేవలం యువతను మభ్యపెట్టేందుకేనని ఆయనన్నారు.

10/01/2018 - 06:38

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా జీఎంఆర్ సెజ్ ప్రాంతంలో అవార్డుకు నిరాకరించిన రైతులు ఈ వ్యవసాయ సీజన్‌లో తమ భూముల్లో నాట్లు వేసుకోడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేయటం అన్యాయమని వామపక్షాల నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రమణక్కపేట పరిసర ప్రాంతాల్లో 300మంది, రావివారిపోడు పరిసరాల్లో 300 మంది రైతులు నాట్లు వేసుకోడానికి రాగా ప్రభుత్వం పోలీసులతో బలప్రయోగం చేసిందని విమర్శించారు.

10/01/2018 - 02:05

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: విశాఖ రుషికొండ వద్ద బీచ్‌లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటకు రాగా, ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. వీరంతా విశాఖ గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వారే కావడం గమనార్హం.

10/01/2018 - 02:03

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంపూర్ణ అవగాహన కోసం అక్టోబర్ 14వ తేదీ తరువాత వారంరోజుల పాటు విజయవాడలో వ్యవసాయ సదస్సు నిర్వహిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాజారాణి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జనసేన నిర్వహించిన పొగాకు, పామాయిల్ రైతుల సదస్సులో ఆయన ప్రసంగించారు.

10/01/2018 - 01:57

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలోని బ్రాహ్మణులు సరస్వతీ పుత్రులే కాని లక్ష్మీపుత్రులు కాదనే నగ్నసత్యాన్ని తొలిసారిగా గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి అభ్యున్నతి కోసం దేశంలోనే తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు.

10/01/2018 - 01:55

విజయనగరం, సెప్టెంబర్ 30: రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని, చేతివృత్తుల వారే తాళిబొట్లను తయారుచేసేలా చట్టసభల్లో తీర్మానం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని భీమసింగి గ్రామం నుంచి పాదయాత్రను జగన్ ప్రారంభించి విజయనగరం నియోజకవర్గం వై జంక్షన్ వరకు కొనసాగించారు.

10/01/2018 - 01:53

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు అవగాహన రాహిత్యంతో రాజకీయాలు నడుపుతున్నారని, వారిలో ఒకరు ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్‌రెడ్డి అయితే, పవన్‌కళ్యాణ్ సామాజిక తీవ్రవాది అని ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు.

10/01/2018 - 01:51

అమరావతి, సెప్టెంబర్ 30: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదరటం లేదు. కేంద్రంలో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తరువాత రాష్ట్ర మంత్రి మండలిలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేసి ఏడాది కావస్తున్నా ఆ స్థానాలు ఇంకా భర్తీకాలేదు.

10/01/2018 - 01:50

గుంటూరు, సెప్టెంబర్ 30: మహిళలకు దేవుడిచ్చిన అన్నగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలుస్తారని పాయకరావుపేట, విజయనగరం శాసనసభ్యులు వంగలపూడి అనిత, మీసాల గీత పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో ని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడంతో పాటు బతోపేతానికి కృషి చేశారన్నారు.

10/01/2018 - 01:49

పెదగంట్యాడ(విశాఖ), సెప్టెంబర్ 30: కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పుడే పుట్టిన పసికందును అంగటిలో పెట్టి విక్రయించిన సంఘటన మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలోని పిట్టవానిపాలెంలో జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసికందు పెదతండ్రి దీనిపై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయ గా విచారణ ప్రారంభించారు.

Pages