S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/02/2018 - 00:05

గుంటూరు, అక్టోబర్ 1: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పదవి నుండి లేళ్ల అప్పిరెడ్డిను తొలగించి చంద్రగిరి ఏసురత్నంను నియమించడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు జగన్ వెంట ఉంటూ జెండామోసిన అప్పిరెడ్డిని ఏకపక్షంగా తొలగించడంపై పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

10/02/2018 - 00:04

అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్రంలో ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 11న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.

10/02/2018 - 00:04

అవసరమైతే జలవనరుల కార్పొరేషన్ ద్వారా మళ్లింపు
కేంద్రం నుంచి వస్తే తిరిగి చెల్లింపు
సకాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావాలి
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
--------------------------------------------------

10/02/2018 - 00:01

అమరావతి, అక్టోబర్ 1: ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం ప్రజావేదిక ప్రాంగణంలో ముఖ్యమంత్రిని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, దేవాదాయశాఖ కమిషనర్ పద్మ, దుర్గగుడి ఈఒ కోటేశ్వరమ్మ, పాలకమండలి సభ్యులు కలుసుకుని దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.

10/02/2018 - 00:01

అమరావతి, అక్టోబర్ 1: రాజధాని అమరావతి నిర్మాణానికి పొన్నూరు నియోజకవర్గం ఉప్పలపాడు రైతులు ముందుకొచ్చారు. సోమవారం ప్రజావేదిక ప్రాంగణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నేతృత్వంలో పెద్దఎత్తున రైతులు తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రూ 5 లక్షల విరాళాన్ని అందజేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం అనిర్వచనీయమని ముఖ్యమంత్రి అభినందించారు.

10/02/2018 - 00:00

అమరావతి, అక్టోబర్ 1: పసుపు- కుంకుమ కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన మొత్తాలను కానీ, మహిళా సంఘాల పొదుపు మొత్తాలు కానీ విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకర్లు అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లబ్ధిదారులు తమ నగదును ఖాతాలో నుంచి తీసుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేయటం సరికాదన్నారు.

10/02/2018 - 02:21

*నేడు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ ప్రారంభం 2లక్షల 10వేలకు చేరిన అర్హుల జాబితా
*ప్రయోగాత్మకంగా అర్థరాత్రి నుంచే రూపాయి జమ
*నిబంధనల సడలింపుతో 20వేల మందికి ప్రయోజనం*మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
*భృతితో పాటు అప్రంటీస్ కాలంలో మరో రూ. 1500 చెల్లింపులో సాధ్యాసాధ్యాలపై పరిశీలన
*

10/01/2018 - 13:07

శ్రీకాకులం: జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దక్షిణాయనంలో మొదటిరోజు లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు. రేపు కూడా సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకే అవకాశం ఉందని పూజారి వెల్లడించారు. దక్షిణాయన మార్పులు నేపథ్యంలో ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకుతాయి.

10/01/2018 - 05:33

అమరావతి, సెప్టెంబర్ 30: ‘కొత్త రాష్ట్రం. ఇబ్బందులు, సవాళ్లు అనేకం ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో సవాళ్లను అధిగమిస్తాం’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. ఆదివారం సచివాలయంలోని సీఎస్ చాంబర్‌లో ప్రస్తుత సీఎస్ దినేష్‌కుమార్ నుంచి నూతన సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

10/01/2018 - 02:09

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 30: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి కుడి, ఎడమల దగా దగా అన్నట్టుగా ఉంది. ఆర్ అండ్ ఆర్ జాబితా నుంచి ఏదో వంకతో పేర్లను తొలగిస్తూ వడపోత కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తోంది. దీంతో నిర్వాసితులు పడరాని పాట్లు పడుతున్నారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు కంటే, కుడి గట్టు వైపు నిర్వాసితులు అగచాట్లు అధికంగా ఉన్నాయి.

Pages