S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/27/2018 - 00:50

సంతమాగులూరు, సెప్టెంబర్ 26:నిర్మాణంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ కుప్పకూలి ముగ్గురి మృతికి కారణమైన ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు పంచాయతీ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఈపూరు ఏసుమరియమ్మ (37), నక్కలబొక్కలపాడుకు చెందిన గోగినేని పూర్ణమ్మ (40), అట్లూరి వెంకటేశ్వర్లు (58)మృతి చెందగా మరో పదిమందికి గాయాలు అయ్యాయి.

09/26/2018 - 17:43

విశాఖపట్నం: విశాఖమన్యంలో మావోల దుశ్చర్యలో పోలీసు శాఖ వైఫల్యం లేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. ఆయన ఈరోజు డీఐజీ శ్రీకాంత్‌తో కలిసి అరకులో పర్యటించారు. మావోయిస్టుల ఘాతుకంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

09/26/2018 - 12:27

విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోల దుశ్చర్యపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విటిపుట్టు గ్రామానికి చెందిన దాదాపు 30 మంది గిరిజనులను పోలీసులు అదుపులోనికి తీసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అదుపులోనికి తీసుకున్న గిరిజనుల నుంచి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు.

09/26/2018 - 05:52

విజయవాడ, సెప్టెంబర్ 25: దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తల కంఠధ్వనికి ప్రతిధ్వనిగా ప్రాజెక్ట్‌శక్తి పనిచేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్‌చాందీ అన్నారు.

09/26/2018 - 05:48

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఎన్నో తప్పిదాలను ఎత్తిచూపిన కాగ్ నివేదికను బేఖాతరు చేయడం తగదని, వాస్తవానికి కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయని గుర్తుంచుకోవాలన్నారు.

09/26/2018 - 05:47

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 25: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల మాదిరిగా విశాఖ నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే బస్సులో వెళ్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని బంగారం స్మగ్లర్‌గా గుర్తించారు.

09/26/2018 - 05:46

ఒంగోలు,సెప్టెంబర్ 25: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రాకు యుద్ధవిమానాల కాంట్రాక్టు ఇవ్వకపోవటం వలనే రాఫెల్ డీల్‌లో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌పార్టీలేనిపోని ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్ధాయిలో విమర్శించారు.

09/26/2018 - 05:44

అమరావతి, సెప్టెంబర్ 25: పోలవరం పూర్తయితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవనే దురుద్దేశ్యంతోనే బురదజల్లుతున్నాయని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ అద్దెమైకులా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పనులు ఇప్పటికే 58.5 శాతం పూర్తయ్యాయన్నారు.

09/25/2018 - 17:38

విశాఖపట్నం: పోలీసుల వైఫల్యం వల్లే విశాఖపట్నంలో మావోయిస్టుల హత్యాకాండ జరిగిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు హత్యకు గురైన తరువాత వారి మృతదేహాలను బంధువులే తెచ్చుకున్నారు తప్పా పోలీసులు తీసుకురాలేదని అన్నారు.

09/25/2018 - 13:22

న్యూయార్క్: ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఐరాసా సదస్సులో కీలకోపన్యాసం ఇచ్చారు. ప్రకృతి సేద్యాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Pages