S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/24/2018 - 02:38

విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సాఫీగా అమలు జరగడానికి తగినంత సమయం కేటాయించి తద్వారా అధికారులు, సిబ్బందిపై పనిఒత్తిడి లేకుండా చేయాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

09/24/2018 - 02:25

నెల్లూరు, సెప్టెంబర్ 23: నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో మూడో రోజైన ఆదివారం దర్గా ప్రాంగణం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సుమారు 5 లక్షల పైబడి భక్తులు ఆదివారం పండుగకు విచ్చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులతో పాటు పలువురు విఐపిలు కూడా దర్గాను సందర్శించి మృతవీరుల సమాధుల వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

09/24/2018 - 02:22

విజయవాడ, సెప్టెంబర్ 23: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల పట్ల రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వచ్చారని ప్రగాఢ సంతాపం తెలిపారు. కిడారి, సోమ హత్యను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు.

09/24/2018 - 02:20

కడియం, సెప్టెంబర్ 23: అఖిల భారత నర్సరీ రైతు సంఘానికి చెన్నైలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా కడియపులంక సత్యదేవ నర్సరీకి చెందిన పుల్లా వీర వెంకట్రావు విజయం సాధించారు. ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్‌కు పాలనా కాలం ముగియటంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష తదితర పదవులకు దేశ వ్యాప్తంగా నర్సరీ రైతులు పోటీపడటంతో బ్యాలెట్ విధానంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి.

09/24/2018 - 02:19

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే బ్రాహ్మణుల అభ్యున్నత ముడిపడివుందని, జంధ్యం ఉన్నంత వరకు బ్రాహ్మణులంతా చంద్రబాబు వెంటే ఉంటారని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు.

09/24/2018 - 02:19

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.

09/24/2018 - 02:18

విజయవాడ, సెప్టెంబర్ 23: ధర్మాబాద్ కోర్టు సమన్లు జారీ చేసిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టుకు హాజరుకాకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోయటం హేయం, దిగుజారుడు రాజకీయానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

09/24/2018 - 02:18

గుంటూరు, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణంపై బీజేపీని ఎండగడుతుంటే ఇక్కడి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి మాత్రం స్పందించడం లేదని, కేవీపీ రామచంద్రరావు దీనిపై జగన్‌కు ఎందుకు లేఖ రాయలేదని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రశ్నించారు. బీజేపీతో జగన్ లాలూచీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

09/23/2018 - 04:38

నెల్లూరు: వైకాపాలో వ్యక్తిగత గౌరవ మర్యాదలకు స్థానం లేదని, పార్టీ అధినాయకుడు నియంతలా వ్యవహరిస్తున్నాడని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

09/23/2018 - 04:21

విజయవాడ, సెప్టెంబర్ 22: అమెరికాలో ప్రైవేట్ సంస్థ నిర్వహించే సమావేశానికి వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు.

Pages