S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/30/2018 - 06:21

తెనాలి, సెప్టెంబర్ 29: తెనాలి పురపాలక సంఘంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా కౌన్సిలర్లు పరస్పరం దాడులకు దిగారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ముష్టి యుద్ధాలు జరిగాయి. ఉదయం 11గంటలకు మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా.. టీడీపీ కౌన్సిలర్ గౌసియాబేగం మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు.

09/30/2018 - 06:17

ఏర్పేడు, సెప్టంబరు 29: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని శ్రీకాళహస్తి- తిరుపతి రహదారిలోని ఏర్పేడు హైస్కూల్ వద్ద రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మంత్రి ప్రయాణిస్తున్న కారు లారీని ఢీ కొట్టింది. ఏర్పేడు సి ఐ మురళి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/30/2018 - 06:16

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాజ్యమేలుతుంటే చంద్రబాబునాయుడుకు ర్యాంకులు వస్తున్నాయని, అసలు కేంద్రం నుంచి మోదీ ఇచ్చిన నిధులు లేకపోతే ఈ పెత్తనమంతా ఎక్కడుంటుందోనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఒక అబద్ధాల పుట్ట అని, పొట్ట విప్పి మైక్రోస్కాప్‌తో చూస్తే అబద్ధాలే ఉంటాయన్నారు.

09/30/2018 - 06:14

గుంటూరు, సెప్టెంబర్ 29: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కేరళ వరద బాధితులకు రూ. 20,78,278 విరాళం అందజేశారు. శనివారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.

09/30/2018 - 06:13

విజయవాడ, సెప్టెంబర్ 29: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయి రెండు సంవత్సరాలు కావస్తున్నా పరిహారం చెల్లించకుండా ఐసీఐసీఐ కంపెనీ తీవ్ర జాప్యం చేస్తున్నదని తక్షణం పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.

09/30/2018 - 05:50

స్టాక్‌హోం, సెప్టెంబర్ 29: ప్రతిష్టాకరమైన నోబెల్ అకాడమి సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి సాలీనా ఇచ్చే నోబెల్ బహుమతిని ఈ ఏడాది ప్రకటించలేదు. ఈ ప్రక్రియను ఈ ఏడాదికి వాయిదా వేసినట్లు నోబెల్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వీడిష్ అకాడమి 1901 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి ఇస్తోంది.

09/29/2018 - 05:56

విజయవాడ, సెప్టెంబర్ 28: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇరువురు తెలుగు ప్రజలకు ద్రోహులని, ఐక్యరాజ్యసమితిలో తెలుగు వాడికి గౌరవం దక్కితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

09/29/2018 - 05:56

విజయవాడ, సెప్టెంబర్ 28: గత నాలుగేళ్లుగా చూస్తున్నానని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రధాని మోదీ ఎన్నో దేశాలు తిరిగి ఏమి సాధించారని ప్రశ్నించారు. రాఫెల్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని ధ్వజమెత్తారు. అసూయకు హద్దు ఉంటుందని హితవుపలికారు.

09/29/2018 - 05:55

విజయనగరం, సెప్టెంబర్ 28: జిల్లాలో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించాయి. అప్పటి నుంచి వాటిని తిరిగి ఒడిశా అడవుల్లోకి పంపేందుకు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే మిగిలాయి. ఈ ఏనుగులను అతికష్టం మీద ఒడిశా అడవుల్లోకి తరలించినప్పటికీ, ఒడిశా అధికారులు వాటిని తిరిగి ఆంధ్రా వైపునకు మరల్చడంతో అవి వెనక్కి వచ్చేశాయి.

09/29/2018 - 05:52

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 28: ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.6500 లంచం తీసుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్-రిజిస్ట్రార్ కర్రెద్దుల పార్థసారథిని అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం వలపన్ని పట్టుకున్నారు. కార్యాలయానికి వెళ్లకుండా, ఇంటివద్ద నుండే విధులు నిర్వర్తిస్తారనే ఆరోపణలున్న పార్థసారథి ఈ కేసులో ఇంటివద్దే లంచం తీసుకుంటూ దొరికిపోవడం విశేషం.

Pages