S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/24/2018 - 17:36

విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంత్యక్రియలలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో పలువురు మంత్రులు ఇరువురి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు.

09/24/2018 - 17:36

విజయవాడ: విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చటాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిఘా వర్గాలను రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. వారి పని వారిని చేసుకునిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని అన్నారు.

09/24/2018 - 12:41

అరకు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కాల్చివేత నేపథ్యంలో అరకులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ అమ్మనరావుపై వేటు పడింది. ఏజన్సీలో బంద్ కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. పోస్టుమార్టమ్ పూర్తయిన తరువాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

09/24/2018 - 06:50

* ఉప రాష్టప్రతి చేతులమీదుగా నేడు పర్యాటక కేంద్రాలు ప్రారంభం...

09/24/2018 - 06:49

అమరావతి, సెప్టెంబర్ 23: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’ వ్యూహం బెడిసికొడుతోంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కత్తులు నూరుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్, నాలుగు శాసనసభ స్థానాలను టీడీపీ మద్దతుతో బీజేపీ దక్కించుకుంది. రాజ్యసభ, శాసనమండలి స్థానాలను సైతం దామాషా పద్ధతిన పంచుకున్నాయి.

09/24/2018 - 06:48

విజయవాడ, సెప్టెంబర్ 23: ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల ఏడు రోజుల సమావేశాల్లో ఎంతో హుషారుగా శాసనసభ్యల చుట్టూ తిరుగుతూ కనిపించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురికావటాన్ని తోటి సభ్యులు, శాసనసభ కార్యాలయ సిబ్బంది నమ్మలేకపోతున్నారు.

09/24/2018 - 06:47

అమరావతి, సెప్టెంబర్ 23: ఇంధన పొదుపు లక్ష్యసాధనలో భాగంగా నిర్వహణ, సాధన, వ్యాపారం (పీఏటీ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ట్రాలకు సూచించింది. ఇంధన పొదుపుతో పాటు గణనీయమైన ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణకు పీఏటీ అమలు తప్పనిసరని స్పష్టం చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరింది.

09/24/2018 - 06:46

మచిలీపట్నం/ విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రపంచంలోనే భారీదిగా నిలిచిన ‘రాఫెల్’ కుంభకోణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిస్థాయి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

09/24/2018 - 02:46

కాకినాడ, సెప్టెంబర్ 23: జీవన్మృతుడు (బ్రెయిన్ డెడ్) అయిన ఓ యువకుడి అవయవాలను బాధితుడి తల్లిదండ్రులు దానం చేసిన అరుదైన, హృదయ విదారకరమైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి స్థానిక అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన ఓ యువకుడికి వైద్యులు శస్తచ్రికిత్స నిర్వహించారు.

09/24/2018 - 02:40

నరసరావుపేట, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో 53వేల కోట్ల రూపాయలను పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ ద్వారా దారి మళ్లించారని, దీనిపై సీబీఐ విచారణ కోరేందుకు కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పీడీ ఎకౌంట్స్ ద్వారా నిధులు దారి మళ్లాయని ఆరోపించారు.

Pages