S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/29/2018 - 05:51

మచిలీపట్నం, సెప్టెంబర్ 28: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అధికారమిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధినంతా దోచేస్తాడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో సుమారు రూ.75కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

09/29/2018 - 00:30

గిరిజన నాయకత్వాన్ని అంతమొందిస్తారా
బాక్సైట్ పాపం వైఎస్‌దే
మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
------------------------------------------

09/29/2018 - 00:27

విజయవాడ, సెప్టెంబర్ 28: అమెరికా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా శుక్రవారం స్వాగతం పలికాయి. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర తదితరులు స్వాగతం పలికారు.

09/29/2018 - 00:25

విజయవాడ, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్ వేస్ ట్రాఫిక్, ఇన్‌లాండ్ వాటర్ వేస్ విస్తరణ క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికను శుక్రవారం అందచేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జెసి శర్మ, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.దుర్గాప్రసాద్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌లతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

09/29/2018 - 00:25

విజయవాడ, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్‌చంద్ర పునేఠాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అనేకమంది ఈ పదవికి పోటీ పడినప్పటికీ సీసీఎల్‌ఏగా పని చేస్తున్న పునేఠాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రస్తుతం సీఎస్‌గా వ్యవరిస్తున్న దినేష్‌కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

09/29/2018 - 00:32

గుంటూరు, సెప్టెంబర్ 28: రాష్ట్రప్రభుత్వం లోటుబెడ్జెట్‌తో ఏర్పడినప్పటికీ ఇచ్చిన హామీమేరకు డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ 10వేల రూపాయల చొప్పున చంద్రన్న పసుపు-కుంకుమ కింద అందజేస్తున్నామని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

09/29/2018 - 00:22

నరసరావుపేట, సెప్టెంబర్ 28: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరూ మరుగుదొడ్లు, రోడ్లు, శ్మశానాలను శుభ్రం చేసుకోవాలని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయలం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇదే గాంధీ మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకోవాలన్నారు.

09/29/2018 - 00:22

విజయవాడ, సెప్టెంబర్ 28: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీ)కు ప్రఖ్యాత హిటాచీ సంస్థ అందచేసే ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ పీపుల్స్ చాయిస్ అవార్డు లభించింది. అమెరికాలోని శాన్‌డీగోలో హిటాచీ నెక్ట్స్-2018 అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ అవార్డును ఆర్టీజీ సీఈవో బాబు.ఎ, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ అందుకున్నారు. ఆర్టీజీ ద్వారా 5 కోట్ల ప్రజలకు అందచేస్తున్న సేవలను ప్రశంసించింది.

09/29/2018 - 00:21

తిరుపతి, సెప్టెంబర్ 28: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం టీటీడీ పాలనా వ్యవస్థను కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ శుక్రవారం పరిశీలించింది. స్థానిక శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ అధికారులతో ఈ బృందం సమావేశమైంది. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టీటీడీ కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు ముందుగా ధర్మకర్తల మండలి, ఈఓ, జేఈఓల విధులను వివరించారు.

09/29/2018 - 00:20

ప్రభుత్వపరంగా రూ.కోటి సహాయం పార్టీపరంగా ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు
కిడారి రెండో తనయుడికి గ్రూప్-1 ఉద్యోగం
విశాఖలో ఇంటి స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
-------------------------------------------------------------------------

Pages