S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/23/2018 - 04:21

అమరావతి, సెప్టెంబర్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. ఇది అంతర్జాతీయ కుంభకోణమని, లేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.

09/23/2018 - 04:20

గుంటూరు, సెప్టెంబర్ 22: సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు న్యాయానికి సమాధి కడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 30వ తేదీన గుంటూరులో జరగనున్న బీసీ గుండెచప్పుడు భారీ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

09/23/2018 - 04:20

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 22: ప్రకృతి వ్యవసాయంలో నూతన పోకడలను అవిష్కరించి వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించిన ఘనత ప్రపంచంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందని శాసన మండలి ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి నుంచి చంద్రబాబుకు ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగం ఇవ్వాలని ఆహ్వానం అందిందన్నారు.

09/23/2018 - 04:19

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అవాస్తవాలు మాట్లాడ్డం ఆపాలని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య హితవు పలికారు. వాస్తవాలు విస్మరించి అవగాహనా రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసి చంద్రబాబును కించపరిచేలా మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించటం జీవీఎల్‌కు మంచిది కాదన్నారు.

09/23/2018 - 04:19

అమరావతి, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యూయార్క్ పర్యటన ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు కాదని, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.

09/23/2018 - 04:17

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్ ప్లాంట్ ఆలోచనను ఉపసంహరించుకోవాలని, దివ్యాంగులకు ఐదు వేల రూపాయల పెన్షన్ అమలు చేయడంతో పాటు అర్హత ఉన్న వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శనివారం రాసిన లేఖలో వివిధ సమస్యలను మధు ప్రస్తావించారు.

09/23/2018 - 04:17

గుంటూరు, సెప్టెంబర్ 22: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తోందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివారం గుంటూరు నగరంలో భారత రాజ్యాంగ పరిరక్షణ మహార్యాలీ జరిగింది.

09/23/2018 - 04:16

విజయవాడ, సెప్టెంబర్ 22: అపరిష్కృత డిమాండ్‌ల సాధనకై రేషన్ డీలర్‌ల జాతీయ సమాఖ్య పిలుపు మేరకు ఈ నెల 25న ఢిల్లీలో రాంలీల మైదానంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నామని దీనికి దేశ వ్యాప్తంగా వేలాది మంది డీలర్లు హారుకాబోతున్నారని సంఘ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవరావు ఓ ప్రకటనలో తెలిపారు.

09/23/2018 - 04:15

విజయవాడ, సెప్టెంబర్ 22: ఆర్టీసీలో గత రెండున్నర సంవత్సరాల క్రితం రద్దయిన కారుణ్య నియామకాలు పునరుద్ధరించినట్లు గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వీస్‌లో ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదన్నారు.

09/23/2018 - 04:14

విజయవాడ, సెప్టెంబర్ 22: సంక్షేమ పథకాలు, చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు అందించే నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు పాల్పడితే సివిల్ కోర్టుగా వ్యవహరించి ప్రాసిక్యూట్ చేసే అధికారం తమ కమిషన్‌కు ఉందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ అన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చైర్మన్ జే పుష్పరాజ్ అధ్యక్షతన నిర్వహించారు.

Pages