S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/22/2018 - 13:28

నెల్లూరు: వైకాపాకు చెందిన నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలు మరొకరికి అప్పగించడంతో అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు.

09/22/2018 - 13:27

తిరుపతి: సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఏర్పాటుచేసిన పలు కార్య్రకమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగర వనాన్ని ప్రారంభించారు. రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్లలో ఏర్పాటుచేసిన ఈ నగర వనంలో యోగా కేంద్రం, పిల్లల ఉద్యానవనం, బోటింగ్, పిల్లల అటవీ విజ్ఞానకేంద్రం, రాశివనం తదితర వాటిని ఏర్పాటుచేశారు. తర్వాత సీఎం చంద్రబాబు తిరుపతి టౌన్‌క్లబ్‌ నుంచి చేపట్టిన హరితర్యాలీలో పాల్గొన్నారు.

09/22/2018 - 12:55

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో తూనికలు కొలతల శాఖ విభాగం అధికారులు విస్తత్రంగా సోదాలు నిర్వహించారు. కృష్ణా, ప.గో, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో విజిలెన్సు అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన పలువురిపై విజిలెన్సు అధికారులు కేసులు నమోదు చేశారు.

09/22/2018 - 12:51

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి బాణాసంచా తయారుచేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుబ్బారావుపేటలోని పూరింట్లో ముత్యాలరెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ఈయన ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. బాణసంచా తయారుచేసి అమ్ముతుంటారు.

09/22/2018 - 06:36

గుంటూరు, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి యువనేస్తం పథకం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తుందని టీడీపీ జాతీయ కార్యక్రమాల కమిటీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు వివివి చౌదరి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి ఆధ్వర్యాన ఆ శాఖ రాష్టస్థ్రాయి విస్తృత సమావేశం జరిగింది.

09/22/2018 - 06:35

విజయవాడ, సెప్టెంబర్ 21: ఏపీఎస్ ఆర్టీసీలో యాజమాన్యం గుర్తింపు సంఘంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా కోడ్ ఆఫ్ డిస్‌ప్లేన్ సర్క్యులర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్‌లో అలాంటి సంఘటనలకు జరగకుండా ఉండేందుకు ఈ నెల 22,23 తేదీల్లో 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోలు, జోనల్ వర్కు షాపుల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లారుూస్

09/22/2018 - 06:34

విఆర్‌పురం, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరడంతో శబరి నది ఆకస్మికంగా పొంగి ప్రవహిస్తోంది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో విఆర్‌పురం, చింతూరు తదితర మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

09/22/2018 - 06:34

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: పోలవరం ప్రాజెక్టు డయాప్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తవ్వడంతో ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. కాఫర్ డ్యామ్‌ల ద్వారా వచ్చే ఏడాదికల్లా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక చేపట్టారు. ఒకవైపు భూసేకరణ, పునరావాసం, హెడ్ వర్క్సులోని కాఫర్ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు.

09/22/2018 - 06:32

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతోందని, కర్నూల్‌లో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ పర్యటన అనంతరం జోష్ పెరిగిందని ఏఐసీసీ కార్యదర్శి, కోస్తా రీజియన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛర్జి క్రిష్ట్ఫోర్ తిలక్ అన్నారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

09/22/2018 - 05:06

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దేశంలో, రాష్ట్రంలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

Pages