S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2018 - 04:02

విజయవాడ, సెప్టెంబర్ 8: కేరళలోని కొట్టాయం నగరంలో ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఆలిండియా న్యూస్ పేపర్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ (ఏఐఎన్‌ఈఎఫ్) 11వ జాతీయ మహాసభలు జరుగుతాయని సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి వీ బాలగోపాలన్, సీనియర్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ సభలకు దేశం నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

09/09/2018 - 04:01

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో సీపీఎస్ పరిధిలో పని చేస్తున్న లక్షా, 84 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను ఆలస్యంగానైనా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పరిష్కరించే దిశగా త్వరలో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయబోతున్నదని శాసన మండలిలో పీఆర్‌టీయు ఫ్రంట్ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు.

09/09/2018 - 04:00

విజయవాడ, సెప్టెంబర్ 8: నాలుగేళ్ల పాలనలో రూ. 1485 కోట్లు ఖర్చు చేసి 53 దేశాలు పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీకి ఒక్క రోజు కూడా పెట్రో ధరలపై సమీక్ష చేయడానికి సమయం దొరకలేదా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్యుల కష్టాలు బీజేపీ నేతలకు పట్టవా అన్నారు.

09/09/2018 - 03:39

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 8: ఇస్కాన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శనివారం శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ రథయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రకరకాల పుష్పాలతో అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

09/09/2018 - 03:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ ప్రాధాన్యత తదితర సమస్యలు చర్చించేందుకు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఈ ఆత్మీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.

09/09/2018 - 03:36

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 8: గతంలో కాంగ్రెస్‌ను దెయ్యంగా అభివర్ణించిన చంద్రబాబుకు నేడు ఆ పార్టీ దేవతలా కనిపిస్తోందా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పరిస్థితులో కాంగ్రెస్ పార్టీని పాతరేయాలని పిలుపు ఇచ్చిన బాబు మాత్రం నేడు తన రాజకీయ లబ్ధి కోసం అదే పార్టీని కౌగిలించుకునేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు.

09/09/2018 - 03:34

చింతూరు, సెప్టెంబర్ 8: అంగన్‌వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకున్న చిన్నారులు వాంతులు, వీరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఎజి కొడేరు గ్రామంలోని అంగన్‌వాడీ-1 కేంద్రంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నారులు యధావిధిగా వెళ్లారు. పిల్లలకు 11 గంటల సమయంలో అంగన్‌వాడీ టీచరు పాలు, గుడ్లు ఆహారంగా ఇచ్చారు.

09/09/2018 - 03:30

అమరావతి, సెప్టెంబర్ 8: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రబలుతున్న అంటువ్యాధుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా అధికారులు, కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌తో పాటు రియల్‌టైం ద్వారా నేరుగా ఆయా జిల్లాల ప్రజలతో పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.

09/09/2018 - 03:29

అమరావతి, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్ గరుడ చేయనున్నారని, రేపోమాపో నోటీసులు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేయడం దుర్మార్గమని శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.

09/09/2018 - 03:28

విజయనగరం, సెప్టెంబర్ 8: కార్డుదారులకు తూకాల్లో తేడాలు చూపించే డీలర్లను వదిలిపెట్టేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడి పౌరసరఫరాల సంస్థ ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల సంస్థ అప్పులో ఉన్నా పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న ఆశయంతో ముందకెళ్తున్నామన్నారు. అలాంటి ఆశయానికి గండి కొడితే సహించేది లేదన్నారు.

Pages